Begin typing your search above and press return to search.
`గే` యువకుల పెళ్లి.. హైకోర్టు సంచలన ఆదేశాలు
By: Tupaki Desk | 17 Dec 2021 2:30 PM GMTయువతీ యువకుడు.. ప్రేమించుకుని పెళ్లిచేసుకునేందుకు రెడీ కావడం.. ఆ వివాహానికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించకపోవడం.. కులాలు.. మతాల పట్టింపలు రావడం.. మొత్తానికి వివాదానికి దారితీయ డం.. తెలిసిందే. దీంతో సదరు యువతీ యువకులు పోలీసులను ఆశ్రయించి.. స్టేషన్‌లోనే ఏడు అడు గులు నడిచిన సంఘటనలు కోకొల్లలు.
అయితే.. దీనికి భిన్నంగా.. ఉత్తరాఖండ్‌లో ఉద్దరు `గే`(స్వలింగసంపర్కులు) యువకులు ప్రేమించుకున్నారు. కొన్నేళ్లుగా.,. వీరు సహజీవనం కూడా చేస్తున్నారు.
అయితే.. ఎన్నాళ్లని ఇలా ఉంటాం.. అనుకున్నారో.. ఏమో.. ఇద్దరూ వివాహం చేసుకుందామని అనుకున్నారు. విషయాన్ని ఎవరికి వారు వారివారి ఇళ్లలో చెప్పారు. ఇక, సహజంగానే ఇలాంటివాటికి ఏ తల్లదండ్రులు మాత్రం ఒప్పుకొంటారు.. ఇలానే.. వీరి పేరెంట్స్ కూడా అడ్డు చెప్పారు. దీంతో వీరు.. హైకోర్టును ఆశ్రయించారు.
దీంతో హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఆ వెంటనే.. రాష్ట్ర పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టి.. స్వయంగా వీరిని తీసుకువెళ్లారు. దగ్గరుండి మరీ వివాహం చేయించి ఓ ఇంటి వారిని చేశారు.
వినేందుకు ఆశ్చర్యంగా అనిపించినా.. ఇది ఉత్తరాఖండ్ లో శుక్రవారం జరిగింది. ఇక్కడి ఉధమ్ సింగ్ నగర్ జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు.. స్వలింగ సంపర్కులు.. అయితే.. వీరి వివాహానికి కుటుంబం అంగీకరించకపోవడంతోపాటు.. బంధువులు దాడి చేసేందుకు ప్రయత్నించారు. దీంతో వీరు ఉత్తరాఖండ్ హైకోర్టు ను ఆశ్రయించారు.
ఈ క్రమంలో.. వీరి పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.. జస్టిస్ ఆర్ ఎస్ చౌహాన్.. జస్టిస్ ఎన్ ఎస్ ధానిక్‌లతో కూడిన ధర్మాసనం.. వీరి వివాహానికి పచ్చజెండా ఊపింది.
అంతేకాదు.. బందువులు ఎవరూ అడ్డు తగలరాదని.. అలా అడ్డు చెబితే.. క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. అదేసమయంలో స్థానిక పోలీసులు.. తక్షణమే ఈ యువకులకు భారీ పటిష్ట భద్రత కల్పించాలని హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది.
దీంతో ఉధమ్ సింగ్ నగర్ ఎస్పీ ఆదేశాల మేరకు సంబంధిత స్టేషన్ సిబ్బంది సుమారు 100 మందితో కూడిన ఎస్కార్ట్‌తో యువకులకు భద్రత కల్పించారు. వీరి వివాహాన్ని పోలీసు పెద్దలు, కొందరు లాయర్ల సమక్షంలో ఘనంగా జరిపించారు. కాగా, ఉత్తరాఖండ్‌లో జరిగిన తొలి గే వివాహంగాన కాకుండా.. దేశంలో జరిగిన తొలి గేవివాహంగా వీరి పెళ్లి రికార్డులకు ఎక్కింది.
గేల వివాహాన్ని గతంలో ఢిల్లీ కోర్టు నేరంగా పేర్కొనగా.. 2013లో సుప్రీం కోర్టు దీనిని కొట్టి వేసి.. గేల వివాహాన్ని చట్టబద్ధం చేయడం గమనార్హం.