Begin typing your search above and press return to search.
ఏపీ సీఎస్ - అసెంబ్లీ సెక్రెటరీ మీద మండిపడ్డ హైకోర్టు
By: Tupaki Desk | 24 Jun 2020 4:30 AM GMTమూడు రాజధానుల ప్రకటన.. సీఆర్డీఏ చట్టం రద్దు నిర్ణయాలను సీఎం వైఎస్ జగన్ తీసుకొని ఆ బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే వాటిని మండలిలో ప్రతిపక్ష టీడీపీ అడ్డుకోవడం.. దాన్ని సెలక్ట్ కమిటీకి పంపింది. తర్వాత కరోనా, లాక్ డౌన్ పరిస్థితులతో మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు నిర్ణయాల్లో జాప్యం అనివార్యమైంది. ప్రభుత్వం కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా నియంత్రణపై తప్పా దేనిపై దృష్టి సారించడం లేదు.
ఈ క్రమంలోనే కొందరు ఈ పాలన వికేంద్రకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి ఏపీ ప్రభుత్వం పంపక పోవడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టు లో పిటీషన్లు దాఖలు చేశారు. దీని పై తాజాగా విచారించిన హైకోర్టు... ఏపీ సీఎస్, అసెంబ్లీ కార్యదర్శిపై మండి పడింది. తాము 4 వారాలు గడువు ఇచ్చినా కౌంటర్లు దాఖలు చేయరా? అని ప్రశ్నించింది.
అయితే కరోనా-లాక్ డౌన్ తర్వాత పరిస్థితులు మారినందున ఇప్పుడున్న పరిస్థితుల్లో వికేంద్రీకరణ సీఆర్డీఏ రద్దు బిల్లుల పై ప్రభుత్వం దృష్టి సారించక పోవడం తో కౌంటర్లు వేయ లేదని ప్రభుత్వం తరుఫున లాయర్లు వాదించారు.
అయితే ఇలా కౌంటర్ దాఖలు చేయకపోవడం అంగీకారయోగ్యం కాదని హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణను ఈరోజుకు హైకోర్టు వాయిదా వేసింది.