Begin typing your search above and press return to search.
ప్రతిదానికి పిల్ దాఖలు చేయడమేనా: టీడీపీ ఎమ్మెల్యేకి హైకోర్టు చీవాట్లు
By: Tupaki Desk | 15 Jun 2022 4:35 AM GMTవిశాఖపట్నం తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతీ దానికీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయడమేనా? అంటూ ప్రశ్నించింది. ప్రభుత్వ చర్యలు, ఉత్తర్వులపై అభ్యంతరముంటే బాధిత వ్యక్తులు కోర్టుకు వస్తారని.. వారికిలేని అభ్యంతరం మీకెందుకని ఎమ్మెల్యే రామకృష్ణ బాబును హైకోర్టు నిలదీసింది. బాధితులు కోర్టుకు రాకుండా మీరెందుకొచ్చారని ప్రశ్నించింది. ప్రభుత్వ చర్యలు, ఉత్తర్వులపై అభ్యంతరముంటే వాటిని శాసనసభలో ప్రస్తావించాలని సూచించింది.
అంతేతప్ప.. ప్రతి అంశంలో పిల్ దాఖలు చేస్తామంటే కుదరదని తేల్చిచెప్పింది. ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ విషయంలో సర్కారు ఉత్తర్వులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే వెలగపూడి దాఖలు చేసిన పిల్‌ను హైకోర్టు కొట్టేసింది.
ఆక్రమణలో ఉన్న అభ్యంతరంలేని ప్రభుత్వ భూములను క్రమబద్ధీకరించేందుకు 2017లో జారీచేసిన జీఓ-388ని ప్రభుత్వం అమలుచేయడం లేదని, దీని ప్రకారం భూములను క్రమబద్ధీకరించేందుకు లక్షల మంది పెట్టుకున్న దరఖాస్తులను అనుమతించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఎమ్మెల్యే రామకృష్ణబాబు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
పిటిషనర్ ఎమ్మెల్యే రామకృష్ణబాబు తరఫు న్యాయవాది ఎస్. ప్రణతి వాదనలు వినిపిస్తూ.. 2017లో టీడపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం ఎంతోమంది తమ స్వాధీనంలో ఉన్న భూములను క్రమబద్ధీకరించుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారని.. ఇలాంటి వారు లక్షల్లో ఉన్నారని తెలిపారు.
అయితే.. ఈ జీఓను అమలుచేయకుండా ప్రభుత్వం కొత్త జీఓ జారీ చేసి భూములను క్రమబద్ధీకరిస్తోందని, దీనివల్ల గతంలో దరఖాస్తు చేసుకున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందన్నారు.
ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. ప్రభుత్వ చర్యలు ఇబ్బందిగా ఉంటే బాధితులు ఎందుకు పిటిషన్ వేయలేదని నిలదీసింది. బాధితులకు లేని ఇబ్బంది పిటిషనర్‌కు ఎందుకని ప్రశ్నించింది. ప్రతీ దానికి ఇలా పిల్ దాఖలు చేయడమేనా? అంటూ అసహనం వ్యక్తంచేసింది. ఈ వ్యవహారంలో ఏ రకంగానూ జోక్యం చేసుకోలేమంటూ రామకృష్ణబాబు పిల్‌ను కొట్టేసింది.