Begin typing your search above and press return to search.
విద్యార్థి మరణం..నేతల గళం.. హైకోర్టు అల్టిమేటం..
By: Tupaki Desk | 29 April 2019 8:55 AM GMTమరో ఇంటర్ విద్యార్థి ప్రాణం పోయింది. నాలుగు రోజుల క్రితం ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయ్యానని మనస్తాపం చెందిన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వట్టిమల్ల గ్రామానికి చెందిన కామిండ్ల లావణ్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. చందూర్తి మండలంలోని కస్తూర్బా కళాశాలలో లావణ్య ఇంటర్ చదువుతోంది. నాలుగురోజుల క్రితం ఇంటర్ ఫెయిల్ అయ్యానని బాధతో ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆమె కరీంనగర్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందిన లావణ్య సోమవారం పరిస్థితి విషమించి మృతిచెందింది. ఇప్పటికే 23మంది విద్యార్థులు మృతిచెందడం.. తాజాగా మరో విద్యార్థిని ప్రాణాలు తీసుకోవడంతో అంతటా విషాధకర వాతావరణం నెలకొంది. లావణ్య మృతికి ఇంటర్ ఫలితాలు కారణమా కాదా అన్న విషయంలో స్పష్టత లేకున్నా ఇంటర్ ఆందోళనలు జరుగుతున్న వేళ ఈ మరణం కలకలం రేపుతోంది.
ఇంటర్ బోర్డు అవకతవకలతో తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు ప్రతిపక్షాలు నిరసనలు చేపడుతున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు, నిరసనలతో నేతలు హోరెత్తుతున్నారు. ఎక్కడికక్కడ పోలీసులు భారీగా మోహరించి చెదరగొడుతున్నారు. పలువురు విద్యార్థి సంఘం నాయకులను , నేతలను ముందస్తుగా అరెస్ట్ లు చేశారు. కాగా తెలంగాణలో ప్రతిపక్షాల గొంతునొక్కడంపై నేతలు భగ్గుమన్నారు. తమను నిర్బంధించడం.. అరెస్ట్ లు చేయడంపై తెలంగాణ ప్రతిపక్షాల నేతలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు.
*చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా: కోదండరాం
ఇంటర్ అవకతవకలతో చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని.. సీఎం కేసీఆర్ రోమ్ చక్రవర్తిలా కనిపిస్తున్నారని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం మండిపడ్డారు. అరెస్ట్ లు చేస్తామని.. న్యాయం చేయమని అంటున్నారని ధ్వజమెత్తారు. వెంటనే విద్యాశాఖమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
* ఇక్కడ చస్తుంటే కేసీఆర్ ఫాంహౌస్ లోనా.?: పొన్నాల
తెలంగాణలో 10 లక్షల కుటుంబాల భవిష్యత్ అగమ్య గోచరంగా మారినా.. కేసీఆర్ మాత్రం ఫాంహౌస్ ను వీడి బయటకు రావడం లేదని పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. ఇలాంటి కేసీఆర్ రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారని ప్రశ్నించారు. కనీసం ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు భరోసా కల్పించని రాక్షస పాలన నడుస్తోందన్నారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం సాగిస్తామని పొన్నాల తెలిపారు.
*గ్లోబరీనా సంస్థ కేటీఆర్ కు తెలియదా?: జీవన్ రెడ్డి
ఇంటర్ ఫలితాల అవకతవకలకు కారణమైన గ్లోబరీనా సంస్థ వెనుక తన హస్తం ఏమాత్రం లేదని.. ఆ సంస్థకు తనకు సంబంధం లేదని కేటీఆర్ అనడంపై కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ కు గ్లోబరీనా అంటే తెలియకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. సాఫ్ట్ వేర్ కు మారుపేరుగా చెప్పుకునే కేటీఆర్ కు గ్లోబరీనా తెలియదా అని జీవన్ రెడ్డిని ఎద్దేవా చేశారు. మీ పిల్లలకో నీతి.. పేదల పిల్లలకో నీతా అని ప్రశ్నించారు. కేటీఆర్ బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. న్యాయ విచారణ చేయాలని కోరారు.
*ఇంటర్ విద్యార్థులు పిట్టల్లా రాలుతున్నారు: లక్ష్మణ్
ఇంటర్ బోర్డ్ అవకతవకల విషయంలో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం తీరుకు ఆవేదన చెందిన విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నారని బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఆయన నగరంలోని బీజేపీ కార్యాలయంలో లక్ష్మన్ సహా బీజేపీ నేతలు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన పిల్లల హక్కులను కాలరాసే హక్కు ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. బంగారు తెలంగాణ దేవుడెరుగు? బలిదానాల తెలంగాణగా మారుస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నిస్తే గొంతు నొక్కుతున్నారన్నారు.
*మే 8లోపు ఇంటర్ లోపాలు సరిదిద్దండి: హైకోర్టు
ఇంటర్ అవకతవకలపై ప్రతిపక్షాల నిరసనలు, విద్యార్థుల ఆత్మహత్యల వ్యవహారంపై కొందరు హైకోర్టుకెక్కారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టు ఫెయిల్ అయిన 3 లక్షల మంది విద్యార్థులకు మళ్లీ రీవెరిఫికేషన్ - రీకౌంటింగ్ పూర్తి చేసి మే 8లోపు పూర్తి వివరాలను కోర్టుకు సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. వివరాలు చూశాక 8వ తేదీన ఈ పిటీషన్ ను విచారిస్తామని తెలిపింది. తదుపరి విచారణను మే 8వ తేదీకి వాయిదా వేశారు.
ఇలా విద్యార్థి ఆత్మహత్య - ప్రతిపక్ష నేతలు గళమెత్తడం.. హైకోర్టు ఇంటర్ అవకతవకలను సరిచేసి మే 8లోపు ఫలితాలను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో వ్యవహారం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. మొత్తం రాజకీయ దుమారానికి కారణమైంది..తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.