Begin typing your search above and press return to search.
ఏపీ సర్కారు ఇంగ్లిషు మీడియం పై హైకోర్టు సీరియస్.. అధికారులకు వార్నింగ్
By: Tupaki Desk | 28 Jan 2020 10:47 AM GMTప్రభుత్వ పాఠశాలల్లో తప్పని సరిగా ఇంగ్లిషు మీడియం లోనే బోధన చేయాలన్న ఏపీ సర్కారు నిర్ణయాన్ని ఏపీ హైకోర్టు తప్పు పట్టింది. విద్యార్థులు తమకు నచ్చిన మీడియంలో చదువుకునే వెసులుబాటు ఇవ్వాలని చెప్పటమే కాదు.. అధికారులకు స్పష్టమైన హెచ్చరికల్ని జారీ చేయటం గమనార్హం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియంను తప్పనిసరి చేస్తూ ఏపీ సర్కారు నిర్ణయించింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
అమ్మ భాషను నిర్లక్ష్యం చేస్తారా? అంటూ భాషాభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తే.. పేదోళ్లకు మాత్రం తెలుగులో.. సంపన్నులు మాత్రం ఇంగ్లిషు మీడియం లో చదువుకోవాలా? అందరికి ఇంగ్లిషు మీడియంను అందుబాటులోకి తేవటమే తమ లక్ష్యంగా ఏపీ సీఎం జగన్ పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏపీ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిషు మీడియంను అమలు చేయాలని డిసైడ్ అయ్యారు. ఇలాంటి వేళ.. సర్కారీ స్కూళ్ల లో తెలుగు మీడియం తీసి వేయటం పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. శ్రీనివాస్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ అంశం పై విచారణ జరిపిన హైకోర్టు ఏపీ సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థులు తాము కోరుకున్న మీడియంలో చదువుకునే ఆప్షన్ ఇవ్వాలని.. నిర్భంద ఇంగ్లిషు బోదన సుప్రీం ఆదేశాలకు విరుద్ధం గా స్పష్టం చేసింది. అదే సమయం లో ఇంగ్లిషు మీడియం కోసం పుస్తకాల ముద్రణ.. శిక్షణ తరగతులు చేపడితే.. అధికారుల పై చర్యలు తప్పవని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన పెట్టే ఖర్చులను సైతం అధికారుల నుంచి రాబడతామని కోర్టు పేర్కొంది. అంతే కాదు.. ఈ అంశం పై పూర్తి వివరాలతో అఫిడవిట్ ను దాఖలు చేయాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. కోర్టు తాజా వ్యాఖ్యల నేపథ్యం లో ఏపీ సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.