Begin typing your search above and press return to search.
కేసీఆర్ ఎమ్మెల్యేకు హైకోర్టు షాక్?
By: Tupaki Desk | 18 Oct 2016 9:51 AM GMTఖమ్మం జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఖమ్మంలో ఆయన నిర్మిస్తున్న ఆసుపత్రి.. మెడికల్ కాలేజీకి సంబంధించి తాము మళ్లీ ఆదేశించే వరకూ ఎలాంటి కొత్త నిర్మాణాల్ని కట్టొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి.. ఆసుపత్రి కడుతున్నట్లుగా ఆరోపణలు వచ్చిన పువ్వాడ అజయ్ కుమార్ పై దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో తాజాగా విచారణ జరిగింది.
ఈ సందర్భంగా పువ్వాడ అజయ్ కుమార్ మీద కంప్లైంట్ చేసిన సుధాకర్ అనే వ్యక్తి.. పువ్వాడ తన ఆసుపత్రి.. మెడికల్ కాలేజీ కోసం రూ.2.5కోట్ల విలువైన భూమిని కబ్జా చేసినట్లుగా ఆరోపించారు. దీనిపై స్పందించిన కోర్టు.. ప్రభుత్వం నుంచి నివేదిక కోరటంతో పాటు.. మూడు వారాల పాటు ఎలాంటి నిర్మాణాలు చేపట్ట వద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై స్పందించిన అజయ్ మీడియా ముందుకు వచ్చారు. హైకోర్టు తీర్పు తనకు షాకింగ్ కానే కాదని వ్యాఖ్యానించారు.
తాను ఎలాంటి కబ్జాకు పాల్పడలేదని.. రూ.2.10కోట్లు ఖర్చు చేసి తానుభూమిని రెగ్యులరైజ్ చేసుకున్నానని.. తనతో పాటు మరో 71 మంది కూడా ప్రభుత్వ నిబందనలకు తగ్గట్లే రెగ్యులర్ చేయించిన విషయాన్ని గుర్తు చేశారు. నిరుపయోగంగా ఉన్నభూమిని రెగ్యులరైజ్ చేయించుకోవటం ద్వారా.. ఆసుపత్రికి.. మెడికల్ కాలేజీకి ఉపయోగపడేలా చేస్తున్నట్లుగా ఆయన చెబుతున్నారు.
మీడియా అభివర్ణిస్తున్నట్లుగా హైకోర్టు తాజాఆదేశాలు తనకు షాకింగ్ ఎంతమాత్రం కాదన్నారు. తనపై ఫిర్యాదు చేసిన సుధాకర్ అనే వ్యక్తి సమాచార హక్కును అడ్డుపెట్టుకొని పలువురిని బెదిరించి వసూళ్లకు పాల్పడుతుంటారని ఆరోపించారు. అతడి గురించి ఖమ్మంలో అందరికి తెలుసన్న పువ్వాడ.. కోర్టు ఆదేశాలకు తగ్గట్లు మూడువారాలు ఎలాంటి నిర్మాణాలు చేపట్టమని చెప్పుకొచ్చారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/