Begin typing your search above and press return to search.
మాజీ మంత్రి పితాని తనయుడికి షాక్ ఇచ్చిన హైకోర్టు !
By: Tupaki Desk | 13 July 2020 2:30 PM GMTఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన ఈఎస్ ఐ కుంభకోణం కేసులో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు పితాని వెంకట సురేశ్ కు రాష్ట్ర హైకోర్టు షాక్ ఇచ్చింది. పితాని వెంకట సురేశ్ ముందస్తు బెయిల్ కి అప్లై చేయగా పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. ఈ ఈ ఎస్ ఐ ఈ కుంభకోణం కేసులో .. ఏ క్షణమైనా అరెస్టు చేస్తారనే భయంతో నిందితులుగా ఉన్న వెంకట సురేశ్, మాజీ పీఎస్ మురళీమోహన్ లు బెయిల్ పిటిషన్ పెట్టుకున్నారు.
కేవలం రాజకీయ కక్షతో ఈ కేసులో ఇరికించారని పిటిషనర్ల తరఫు న్యాయవాది చల్లా అజయ్ కుమార్ వాదించారు. వెంకట సురేశ్ ఏ రోజు తన తండ్రి పదవిని దుర్వినియోగం చేయలేదని, ఆయన వద్ద కార్యదర్శిగా ఉన్న మురళీమోహన్ కు ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధమూ లేదని తెలిపారు. ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. ఈ అభ్యర్థనతో ఏసీబీ తరపు న్యాయవాది విభేదించారు. ఇరు వైపుల వాదనలను విన్న జడ్జి బెయిల్ పిటిషన్ ను తిరస్కరించారు. కాగా, సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న మురళీ మోహన్ ను శుక్రవారం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.