Begin typing your search above and press return to search.

జేసీ ఫ్యామిలీ కి షాకిచ్చిన హై కోర్ట్ ..ఏ విషయం లో ఆంటే !

By:  Tupaki Desk   |   27 Nov 2019 7:47 AM GMT
జేసీ ఫ్యామిలీ కి షాకిచ్చిన హై కోర్ట్ ..ఏ విషయం లో ఆంటే  !
X
జేసీ దివాకర్ రెడ్డి ..ఆంధ్రప్రదేశ్ రాజకీయాల లో కొన్ని రోజుల పాటు చక్రం తిప్పిన కీలక నేత. ఎదుట ఉన్నది ఎవరైనా ..తన అభిప్రాయాన్ని ఏ మాత్రం సంకోచం లేకుండా చెప్పగల ఏకైక రాజకీయ నాయకుడు. అలాగే అనంతపురం రాజకీయాల లో మొన్నటి వరకు చాలా కీలకంగా వ్యవహరించారు. కానీ , మారిన రాజకీయ పరిస్థితుల ప్రభావం తో అయన తన ఉనికిని కోల్పోతూ వస్తున్నారు. ఇక పోతే గత కొన్ని రోజులుగా ఆయనకి వరుసగా షాకులు తగులుతున్నాయి. దివాకర్ ట్రావెల్స్‌ కు చెందిన బస్సులను వివిధ కారణాల తో ఆర్టీఏ అధికారులు సీజ్ చేయడంతో అయన ప్రభుత్వం పై ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు.

ఇక తాజాగా జేసీ ఫ్యామిలీ కి మరో షాక్ తగిలింది. త్రిశూల్ సిమెంట్ కంపెనీకి లైమ్‌ స్టోన్ మైనింగ్ లీజ్ మంజూరు విషయంలో జేసీ కుమారుడు పవన్ రెడ్డి, కోడలు సంయుక్తారెడ్డిలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వీరితో పాటు త్రిశూల్ సిమెంట్ సంస్థలు, వ్యాపార భాగస్వామి వేణుగోపాల్ రెడ్డి కి కూడా కోర్టు నోటీసులు ఇష్యూ చేసింది. ఈ కేసులో మంగళవారం విచారణ జరిపిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌ తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చి, ఈ కేసుని డిసెంబర్ 30 కు వాయిదా వేసింది.

కేసు గురించి పూర్తి వివరాలు చూస్తే ...లైమ్ స్టోన్ మైనింగ్ లీజు కోసం త్రిశూల్ సిమెంట్ కంపెనీ మోసాలకు పాల్పడిందంటూ తాడిపత్రి కి చెందిన మురళీ ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి 2011లో హైకోర్టులో పిల్ వేశారు. ఈ కేసును విచారిస్తున్న హైకోర్టు గత నెలలో దివాకర్ రెడ్డి సహా పలువురికి నోటీసులు జారీ చేసింది. తాజాగా ఆయన కుమారుడు, కోడలికి నోటీసులిచ్చింది.ఇకపోతే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా జేసీ పార్టీ మారుతారన్న వార్తలు కూడా ఎక్కువైయ్యాయి.