Begin typing your search above and press return to search.

తెలంగాణ సర్కార్ కు హైకోర్టు నోటీసులు

By:  Tupaki Desk   |   19 Jun 2020 3:30 PM GMT
తెలంగాణ సర్కార్ కు హైకోర్టు నోటీసులు
X
తెలంగాణ సీఎం కేసీఆర్ కు హైకోర్టులో మరో చుక్కెదురైంది. ఈ మధ్య వరుసగా హైకోర్టు ఆదేశాలతో కేసీఆర్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. కరోనా కష్టకాలంలో కేసీఆర్ తీసుకుంటున్న చర్యలు బాగా లేవని ఇప్పటికే హైకోర్టు ఎండగట్టింది. ఆ విషయం మరిచిపోకముందే ఇప్పుడు మరో ఉపద్రవం వచ్చిపడింది.

ఇటీవల కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పింఛన్లలో కోత విధిస్తూ తెచ్చిన ఆర్డినెన్స్ వివాదాస్పదమైంది. అన్ని రాష్ట్రాలు ఫుల్ జీతం ఇస్తుండగా.. తెలంగాణలో మాత్రమే ఇలా జీతాలు కట్ చేయడంపై ఉద్యోగులు, పింఛనర్లలో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఈ ఆర్డినెన్స్ ను సవాల్ చేస్తూ విశ్రాంత డీఎఫ్.వో రామన్ గౌడ్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధంగా ఉందని వాదనలు వినిపించారు.

పిటీషనర్ వాదనలు విన్న హైకోర్టు మూడు వారాల్లో దీనిపై వివరణ ఇవ్వాలని తాజాగా ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

ఇక పీజీ మెడికల్, దంత పరీక్షల వాయిదాను హైకోర్టు నిరాకరిస్తూ వెంటనే యథావిధిగా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వానికి ఆదేశించింది.