Begin typing your search above and press return to search.
ధరణి పోర్టల్ పై హైకోర్టులో కీలక పరిణామం
By: Tupaki Desk | 16 Dec 2020 2:14 PM GMTతెలంగాణలో ఆస్తుల నమోదు, రిజిస్ట్రేషన్ల కోసం కేసీఆర్ సర్కార్ ‘ధరణి పోర్టల్’ను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వ్యవసాయేతర భూ రిజిస్ట్రేషన్లను ప్రారంభిస్తున్నట్టు తెలిపింది.
కాగా ధరణి పోర్టల్ పై హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేస్తామని గతంలో హైకోర్టుకు ప్రభుత్వం చెప్పినప్పటికీ అది అమలు కావడం లేదంటూ పిటీషనర్ తరుఫు న్యాయవాది దేశాయి ప్రకాష్ కోర్టులో వాదనలు వినిపించారు.
వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై వ్యక్తిగత వివరాలతోపాటు కొనుగోలు దారులు, అమ్మకం దారుల కుటుంబ సభ్యుల వివరాలు కావాలనడంపై పిటీషనర్ అభ్యంతరం తెలిపారు. ఆధార్ కార్డును కోర్టు వద్దన్నా ప్రభుత్వం వివరాలు సేకరిస్తోందని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
దీనిపై ప్రభుత్వం స్పందించింది. ధరణి పోర్టల్ లో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై రేపటి గురువారం వరకు స్టే పొడిగించింది. ప్రభుత్వం కోర్టుకు చెబుతోంది ఒకటి అయితే.. బయట చేస్తోంది మరొకటి అని హైకోర్టు అభిప్రాయపడింది. పూర్తి వివరాలతో ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ సమర్పించాలని తెలంగాణ సర్కార్ ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసేసింది.