Begin typing your search above and press return to search.
ట్యాపింగ్ కేసులో ఏపీకి ఎదురుదెబ్బ?
By: Tupaki Desk | 8 Sep 2015 4:26 AM GMTఫోన్ ట్యాపింగ్ కేసులో ఏపీ సర్కారుకు ఇబ్బందికరంగా మారిందన్నట్లుగా పరిస్థితి ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో విజయవాడ కోర్టు ఇచ్చిన ఆదేశాల్ని హైకోర్టు నిలిపివేయటంతో పాటు.. ఈ కేసును విచారణ చేస్తున్న అధికారులకు సంబంధించి తెలంగాణ సర్కారు తరఫు న్యాయవాదులు చేసిన వాదనకు అనుకూలంగా హైకోర్టు నిర్ణయం తీసుకోవటం ఏపీ సర్కారుకు ఎదురుదెబ్బగా చెప్పక తప్పదు.
తెలంగాణ ఏజీ చేసిన వాదనకు సానుకూల స్పందన రావటమే కాదు.. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన అన్ని చర్యల్ని నిలిపివేయాలని హైకోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఇక కాదు.. విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ జారీ చేసిన ఆదేశాలన్ని నిలిపివేయాలని కోరుతూ తెలంగాణ హోం శాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్ త్రివేది దాఖలు చేసిన పిటీషన్ పై హైకోర్టు సానుకూలంగా స్పందించింది.
ట్యాపింగ్ కేసు విచారణ ఉన్నత న్యాయస్థానంలో ఉన్నప్పుడు కింది కోర్టులు కలుగజేసుకోవటం సరికాదని.. ఈ కేసుకు సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బృందం పారదర్శకంగా పని చేయటం లేదంటూ తెలంగాణ అడ్వకేట్ జనరల్ వాదించి.. విజయవాడ కోర్టు ఆదేశాలకు స్టే ఇవ్వాలని కోరారు. దీనికి ఏపీ అడ్వొకేట్ జనరల్ వాదిస్తూ.. కాల్ డేటాకు సంబంధించిన ఆధారాల్ని నాశనం చేసే అవకాశం ఉందన్నారు.
దీనికి స్పందించిన హైకోర్టు.. న్యాయస్థానం ఆదేశించిన తర్వాత ఆధారాలు నాశనం చేస్తారని ఎందుకు అనుకుంటున్నారని ప్రశ్నించి.. రాజీవ్ త్రివేది కోరినట్లుగా ట్యాపింగ్ కేసులో తదుపరి చర్యల్ని నిలిపివేయాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేయటం గమనార్హం.