Begin typing your search above and press return to search.
స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం : తదుపరి చర్యలు నిలిపివేయాలంటూ కోర్టు ఆదేశాలు !
By: Tupaki Desk | 25 Aug 2020 11:50 AM GMTవిజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్ కరోనా కేర్ సెంటర్లో జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా, ఈ ప్రమాదం పై నమోదైన ఎఫ్ఐఆర్ పై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. తమపై ఏపీ పోలీసులు దాఖలు చేసిన కేసులను సవాల్ చేస్తూ రమేష్ ఆస్పత్రి యజమాని డాక్టర్ రమేష్ బాబు దాఖలు చేసిన పిటిషన్ పై నేడు విచారణ జరిపిన రాష్ట్ర హైకోర్టు.. కీలక ఆదేశాలు జారీచేసింది.
ఈ కేసులో పోలీసులు రూపొందించిన ప్రాథమిక దర్యాప్తు నివేదిక ఎఫ్‌ఐఆర్ పై స్టే విధించింది. అంతే కాకుండా రమేష్ ఆస్పత్రిపైనా, ఛైర్మన్ రమేష్ బాబుపైనా తదుపరి చర్యలను నిలిపివేసింది. ఈ కేసులో హైకోర్టులో జరిగిన విచారణలో రమేశ్ ఆసుపత్రి తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. అయితే ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు రమేష్ ఆస్పత్రికి చెందిన ముగ్గురు ఉద్యోగులను ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. వీరు ప్రస్తుతం మచిలీపట్నం జైల్లో ఉన్నారు.
విచారణ సందర్భంగా హైకోర్టు... స్వర్ణ ప్యాలెస్ హోటల్ ను కొవిడ్ కేర్ సెంటర్ గా అనుమతించిన జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్, డీఎం అండ్ హెచ్ఓలను ఎందుకు బాధ్యులుగా చేయలేదని ప్రశ్నించింది. స్వర్ణప్యాలెస్ ను రమేష్ ఆస్పత్రి లీజుకు తీసుకోకముందే వందే భారత్ మిషన్ కింద విదేశాల నుంచి చేరుకున్న ప్రయాణికులకు పెయిడ్ క్వారంటైన్ గా ప్రభుత్వం వాడుకుంది. ఆ విషయాన్ని ఈ రోజు కోర్టు ప్రభుత్వాన్ని అడిగింది.