Begin typing your search above and press return to search.
బాబు సర్కారుకు ‘జగన్’ పంచ్ పడింది
By: Tupaki Desk | 12 Sep 2016 6:38 AM GMTఏపీ ముఖ్యమంత్రి చంద్రబుబ దూకుడుకు బ్రేకులు పడ్డాయి. ఏపీ రాజధానిఅమరావతి నిర్మాణంపై ఆయన అనుసరిస్తున్న విధానాలపై తీవ్ర విమర్శలువెల్లువెత్తటం తెలిసిందే. అమరావతి నిర్మాణానికి సంబంధించి ఏపీ సర్కారుఅనుసరిస్తున్న స్విస్ ఛాలెంజ్ పద్దతిపై ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రం గా వ్యతిరేకిస్తున్నారు. స్విస్ విధానం ఏ మాత్రం మంచిది కాదన్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాదన.
స్విస్ ఛాలెంజ్ విధానంలో లొసుగులు ఉన్నాయని.. విలువైన భూములతోపాటు.. నిధుల్ని విదేశీ కంపెనీలకు అప్పజెప్పాల్సి ఉంటుందని.. ఈ విధానంలోకంపెనీలు బాగు పడటం తప్పించి ప్రభుత్వానికి.. ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నది ప్రధాన ఆరోపణ. ఏపీ సర్కారుకు ఎంపిక చేసిన ఈ విధానాన్ని సవాలు చేస్తూ ఆదిత్య కన్ స్ట్రక్షన్స్.. చెన్నైకి చెంది ఎన్ వీఎన్ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు హైకోర్టును ఆశ్రయించాయి.
దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఏపీ సర్కారు తీరుపై అభ్యంతరం వ్యక్తంచేసింది. స్విస్ చాలెంజ్ విధానాన్ని విభేదించిన హైకోర్టు.. ఈ విధానాన్నితాత్కాలికంగా నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకుసంబంధించి తదుపరి వాయిదాను అక్టోబరు 31కి వాయిదా వేస్తూ నిర్ణయంతీసుకుంది. బాబు సర్కారు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న స్విస్ విధానాన్ని హైకోర్టు తప్పు పట్టటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హైకోర్టు తాజా ఆదేశాలతో జగన్ చేస్తున్న వాదనలో బలం ఉందన్న భావన వ్యక్తమవుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.