Begin typing your search above and press return to search.

ఇంజనీరింగ్ ఫీజుల జీవో సస్పెండ్.. ఏపీసర్కార్ కు షాక్

By:  Tupaki Desk   |   7 May 2020 1:26 PM GMT
ఇంజనీరింగ్ ఫీజుల జీవో సస్పెండ్.. ఏపీసర్కార్ కు షాక్
X
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాకిచ్చింది. ఇంజనీరింగ్ ఫీజుల విషయంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇంజనీరింగ్ కాలేజీలకు ఫీజులు నిర్ణయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోనంబర్ 15ను హైకోర్టు సస్పెండ్ చేసింది.

ఇటీవల ఏపీ ప్రభుత్వం ఇంజనీరింగ్ కాలేజీలకు ఫీజులు నిర్ణయిస్తూ ప్రబుత్వం జీవో జారీ చేసింది. అయితే ఈ ఫీజులు ఆశించినంత లేవని.. ప్రభుత్వం సరిగా నిర్ణయించలేదని 23 ఇంజనీరింగ్ కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈరోజు పిటీషన్ పై విచారణ జరిగింది.

ఈ సందర్భంగా ప్రభుత్వం ఫీజులు సరిగ్గా నిర్ణయించలేదని పిటీషన్ దారులు వాదించారు. కాలేజీలను పరిశీలించాకే ఫీజులను నిర్ణయించామని ప్రభుత్వం తరుఫు లాయర్లు వాదిస్తున్నారు.

ఇటీవలి కాలంలో సీఎం జగన్ సర్కారు తీసుకుంటున్న చర్యలు హైకోర్టులో వరుసగా చుక్కెదురవుతోంది. మొన్నటికి ఇంగ్లీష్ మీడియం చదువులపై ఎదురుదెబ్బ తగిలింది. అంతకుముందు రాజధాని మార్పుపై కూడా హైకోర్టులో తీర్పు వ్యతిరేకంగా వచ్చింది. నేడు ఇంజనీరింగ్ ఫీజుల విషయంలోనూ జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది.