Begin typing your search above and press return to search.

జడ్జిల మీద కాదు. ఈసారి లీగల్ ఉద్యోగులపై వేటేశారు

By:  Tupaki Desk   |   30 Jun 2016 9:18 AM GMT
జడ్జిల మీద కాదు. ఈసారి లీగల్ ఉద్యోగులపై వేటేశారు
X
జడ్జిల నియామకంపై తెలంగాణ జడ్జిల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం చేపట్టిన నిరసన ప్రదర్శన తాలూకు ప్రకంపనలు హోరు ఇంకా తగ్గలేదు. దేశ చరిత్రలో తొలిసారి జడ్జిలు రోడ్ల మీదకు రావటం.. తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేయటం.. గవర్నర్ నివాసమైన రాజభవన్ వద్దకు సమూహంగా వెళ్లే ప్రయత్నం చేయటం లాంటి అంశాలపై హైకోర్టు సీరియస్ కావటం తెలిసిందే.

క్రమశిక్షణా చర్యల్లో భాగంగా సోమవారం ఇద్దరు జడ్జిలపై సస్పెన్షన్ వేటు వేసి హైకోర్టు.. మంగళవారం మరో తొమ్మిది మంది జడ్జిలపై వేటు వేసి.. క్రమశిక్షణపై రాజీ లేదన్న రీతిలో వ్యవహరించటం తెలిసిందే. బుధవారం ఎలాంటి చర్యలు లేనప్పటికీ.. జడ్జిల సెలువులన్నీ హైకోర్టుకు సమాచారం అందించాల్సి ఉంటుందన్న ఆదేశాలు జారీ చేయటం తెలిసిందే.

ఈ రోజు ఈ వ్యవహారంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటివరకూ జడ్జిల మీద సస్పెన్షన్ వేటు వేసిన హైకోర్టు.. తాజాగా లీగల్ ఆఫీసర్ల మీద వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం నలుగురు లీగల్ అధికారులపై వేటువేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రంగారెడ్డి కోర్టుకు సంబంధించిన నలుగురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.తాజా పరిణామాలు చూస్తే.. నిరసనలపైన హైకోర్టు సీరియస్ గా ఉందన్న విషయాన్ని స్పష్టం చేసినట్లుగా చెప్పొచ్చు. నిరసనలకు పాల్పడిన వారిలో మరికొందరిపై వేట్లు తప్పవని చెబుతున్నారు.