Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు షాక్.. కూల్చివేతకు హైకోర్టు బ్రేక్!

By:  Tupaki Desk   |   8 July 2019 7:55 AM GMT
కేసీఆర్ కు షాక్.. కూల్చివేతకు హైకోర్టు బ్రేక్!
X
అనుకున్నట్టే అయ్యింది. తెలంగాణ సచివాలయం, ఎర్రమంజిల్ భవనాలను కూల్చివేసి కొత్త భవనాలను నిర్మించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి హైకోర్టు బ్రేక్ వేసింది. ఈ భవనాలపై తాజాగా సోమవారం దాఖలైన పిటీషన్ ను విచారించిన హైకోర్టు కౌంటర్ కోసం ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ కు గడువు ఇచ్చింది. ఆ తర్వాత నేరుగా వాదనలు విన్నాక నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. అప్పటిదాకా ఈ భవనాలను కూల్చివేయకూడదని సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

గత నెల 27న కేసీఆర్ కొత్త సచివాలయం, అసెంబ్లీ భవనాల కోసం భూమిపూజ కూడా చేశారు. త్వరలోనే పాత సచివాలయం - ఎర్రమంజిల్ కూల్చివేతకు నిర్ణయించారు. అయితే ఈలోగానే నిన్న అఖిలపక్షాలు - ప్రజాసంఘాలు హైదరాబాద్ లో భేటి అయ్యి ఈ కూల్చివేతలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు.

ఈ కోవలోనే సోమవారం పిటీషన్లను దాఖలు చేయగా కోర్టు దీనిపై ప్రభుత్వ సంజాయిషీ కోరుతూ ఆ తర్వాత తీర్పు చెబుతామని ప్రస్తుతానికి ఆ భవనాలు కూల్చవద్దంటూ ఆదేశాలిచ్చింది.

ఈ పరిణామం తెలంగాణ సీఎం కేసీఆర్ కు షాక్ లా మారింది. త్వరగా కూల్చిసి దసరా వరకు కొత్త సచివాలయం, అసెంబ్లీని కడుదామనుకుంటున్న ఆయన ఆశలకు హైకోర్టు బ్రేక్ వేసింది. మరి కౌంటర్ గా కేసీఆర్ హైకోర్టుకు ఏం చెప్తారు. ఆ భవనాలను కూల్చడం సాధ్యపడుతుందా లేదా అన్నది ఇక హైకోర్టు చేతుల్లోకి వెళ్లింది.