Begin typing your search above and press return to search.

ఆ మీడియా కోర్టు ధిక్కార కేసు హైకోర్టుకు బదిలీ

By:  Tupaki Desk   |   15 Sep 2021 3:30 PM GMT
ఆ మీడియా కోర్టు ధిక్కార కేసు హైకోర్టుకు బదిలీ
X
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియా హౌస్‌పై దాఖలైన కోర్టు ధిక్కార కేసు ఆసక్తికరమైన మలుపు తిరిగింది. తెలంగాణ హైకోర్టు బుధవారం ఈ కేసును సిబిఐ కోర్టు నుంచి స్వీకరించింది.

తాజాగా హైకోర్టు జగన్ బెయిల్ రద్దుకు సంబంధించిన కేసును మరొక క్రిమినల్ కోర్టుకు బదిలీ చేయాల్సిందిగా కోరుతూ నరసాపురం వైఎస్ఆర్‌సి రెబల్ ఎంపి కె. రఘురామ కృష్ణం రాజు పిటిషన్‌ను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

సాక్షి మీడియా హౌస్‌పై కోర్టు ధిక్కార కేసును కూడా రఘురామ కృష్ణం రాజు తన పిటీషన్ లో పేర్కొన్నాడు. సోషల్ మీడియాలో జగన్ బెయిల్‌ను రద్దు రద్దు అయ్యిందని అవాస్తవాలు ప్రచారం చేసిందని కోర్టుకెక్కాడు. సిబిఐ ప్రత్యేక కోర్టు రాజు వేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది.

గత వారం సీబీఐ కోర్టు సాక్షి మీడియా ఎడిటర్ వర్ధెల్లి మురళి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వినయ్ మహేశ్వరికి సమన్లు జారీ చేసింది. వారికి కౌంటర్లు దాఖలు చేయడానికి సెప్టెంబర్ 13 వరకు సమయం ఇచ్చింది.

సాక్షి ప్రతినిధులు సోమవారం కోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. కథనాన్ని ప్రచురించడం ఉద్దేశపూర్వకంగా.. దురుద్దేశపూర్వకంగా కాదని.. సంపాదకీయ సిబ్బంది పొరపాటు కారణంగా జరిగిందని పేర్కొన్నారు. కోర్టులో విచారణ ఇంకా కొనసాగుతోందని తెలిసిన వెంటనే వెబ్‌సైట్ నుంచి పోస్ట్.. సోషల్ మీడియాలో ట్వీట్ రెండింటినీ తొలగించినట్లు వారు కోర్టుకు తెలిపారు.

‘జగన్ బెయిల్ రద్దు’ అంటూ వార్త ప్రచురించిన సాక్షి జర్నలిస్ట్ ఉద్యోగం నుండి తొలగించబడ్డారు. తప్పుడు కమ్యూనికేషన్ కారణంగా వార్తలు తప్పుగా ప్రచురించబడ్డాయి. వెబ్‌సైట్.. ట్విట్టర్ నుండి వెంటనే ఉపసంహరించుకున్నారు. సాక్షి మీడియాలో ఈ తప్పుకు చింతిస్తున్నాం అని కూడా పోస్ట్ చేశారు.

సాక్షి కోర్టు ధిక్కార కేసులో సీబీఐ కోర్టు తీర్పు వెలువరించాల్సి ఉన్నప్పటికీ హైకోర్టు ఈ కేసును చేపట్టనున్నట్లు ప్రకటించింది. పిటిషన్, వాదనలకు సంబంధించిన అన్ని రికార్డులను హైకోర్టుకు బదిలీ చేయాలని సిబిఐ కోర్టును కోరింది.