Begin typing your search above and press return to search.
రోజాకు హైకోర్టు షాక్
By: Tupaki Desk | 22 March 2016 7:44 AM GMTవైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాకు హైకోర్టులో చుక్కెదురైంది. సింగిల్ బెంచ్ న్యాయమూర్తి ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం తోసిపుచ్చింది. రోజాపై సస్పెన్షన్ విషయంలో అసెంబ్లీ కార్యదర్శి వాదనను హైకోర్టు ధర్మాసనం సమర్థించింది. దీంతో టీడీపీపై పైచేయి సాధించినట్లుగా భావిస్తున్న రోజా వ్యవహారంలో మళ్లీ టీడీపీది పైచేయి అయింది. తాజా పరిణామాలతో ఒక్కసారిగా రాజకీయాలు మారాయి. రోజా - వైసీపీ కూడా డిఫెన్సులో పడినట్లయింది.
రోజాపై అసెంబ్లీలో ఏడాది పాటు విధించిన సస్పెన్షన్ చెల్లదంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన నిలపుదల ఉత్తర్వులపై ఏపీ అసెంబ్లీ కార్యదర్శి అప్పీలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ద్విసభ్య ధర్మాసనం సోమవారం ఇరుపక్షాల వాదనలు విన్నది. అనంతరం తీర్పును మంగళవారానికి వాయిదా వేసింది. ఈ రోజు తీర్పు ఇస్తూ సింగిల్ బెంచి జడ్జి తీర్పును కొట్ చేసింది. రోజాకు అనుకూలంగా ఇంతకుముందు తీర్పు రాగా దాన్ని శాసనసభ ఆమోదించకుండా ఆమెను సభలోకి రానివ్వకుండా అడ్డుకోవడంతో వైసీపీ ఇప్పటికే నిరసన తెలుపుతోంది. తాజాగా మళ్లీ రోజాకు వ్యతిరేకంగా కోర్టులోనూ నిర్ణయం వెలువడడంతో వైసీపీ ఎలాంటి స్టెప్ వేస్తుందో చూడాలి.