Begin typing your search above and press return to search.
మరియమ్మ లాకప్ డెత్ పై హైకోర్టు తీర్పు .. ఏం చెప్పిందంటే ?
By: Tupaki Desk | 29 Nov 2021 10:30 AM GMTతెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన మరియమ్మ లాకప్ డెత్ కేసులో తెలంగాణ హైకోర్టు సోమవారం కీలక తీర్పు వెల్లడించింది. ఈ కేసును సీబీఐకి అప్పగించేందుకు నిరాకరించిన రాష్ట్ర హైకోర్టు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఓ మహిళను అంత దారుణంగా కొడతారా అని మండిపడిన హైకోర్టు, బాధ్యులైన పోలీసులపై ఏం చర్యలు తీసుకున్నారని నిలదీసింది. కోర్టు ఇప్పటికే ఇచ్చిన రిపోర్టు ఆధారంగా ప్రత్యేక బృందం దర్యాప్తు కొనసాగించాలని ఆదేశించింది.
కాగా, యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగుడూరు పోలీసు స్టేషన్ పరిధిలో జూన్ నెలలో మృతి చెందిన మరియమ్మ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దొంగతనం కేసులో ఇంటరాగేషన్ పేరుతో మరియమ్మపై స్టేషన్లో థర్ఢ్ డిగ్రీ ప్రయోగించారు. మరియమ్మ దెబ్బలకు తాళలేక స్పృహ కోల్పోయింది. దీంతో పోలీసులు స్థానిక ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. నాడి పరిశీలించిన వైద్యుడు పరిస్థితి విషమంగా ఉందని, పల్స్ దొరకడం లేదని చెప్పడంతో హుటాహుటిన భువనగిరి జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. అక్కడ పరిశీలించిన వైద్యులు చనిపోయినట్లు చెప్పారు.
ఈ ఘటనపై ప్రతిపక్షాలు, అనేక ప్రజా సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. క్రమంగా ఇది ఉద్యమంలా మారడంతో తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. దీంతో స్పందించిన ప్రభుత్వం మరియమ్మ కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే మరియమ్మ లాకప్ డెత్ కేసుకు సంబంధించి ముగ్గురు పోలీసు అధికారులను విధుల నుంచి తొలగించింది. ఎస్ఐ మహేశ్వర్, కానిస్టేబుల్స్ రషీద్, జానయ్యలను శాశ్వతంగా విధుల నుండి బహిష్కరిస్తూ ఆదేశాలు జారీచేసింది. అంతటితో ఆగకుండా ఆ ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్లు గతంలోనే ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.
అయితే ఈ కేసును సీబీఐ విచారణకు అప్పగించాలన్న డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలోనే సీబీఐ విచారణకు ఆదేశిస్తే ప్రజలకు పోలీసులపై నమ్మకం సన్నగిల్లే అవకాశం ఉందని అడ్వకేట్ జనరల్ కోర్టుకు విన్నవించారు. రాష్ట్రంలో ఉన్న దర్యాప్తు సంస్థలతోనే విచారణ జరిపించేలా ఆదేశాలివ్వాలని కోరారు. దీనిపై వాదనలు విన్న హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించాల్సిన అవసరం లేదని పేర్కొంటూ సోమవారం కీలక తీర్పు వెలువరించింది.