Begin typing your search above and press return to search.

వివేకా హత్య: టీడీపీ - వైసీపీలకు హైకోర్టు వార్నింగ్

By:  Tupaki Desk   |   30 March 2019 10:58 AM GMT
వివేకా హత్య: టీడీపీ - వైసీపీలకు హైకోర్టు వార్నింగ్
X
ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ వైఎస్ వివేకానందరెడ్డి హత్య టీడీపీ - వైసీపీల మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. ఇరు పార్టీలు ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేకా హత్యను రాజకీయంగా వాడుకొని దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు ప్రతీ సభలోనూ వైఎస్ వివేకాను జగన్ కుటుంబ సభ్యులే హత్య చేయించారని సంచలన ఆరోపణలు చేస్తుండగా.. ఇక వైఎస్ జగన్ సైతం అంతే ధీటుగా స్పందిస్తున్నారు. వైఎస్ వివేకాను చంపింది టీడీపీ అని.. దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని జగన్ డిమాండ్ చేస్తున్నారు..

తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఈ కేసు వెళ్లింది. రాజకీయ పావుగా మారిన వైఎస్ వివకానందరెడ్డి హత్య విషయంలో ఏ రాజకీయ నేత మాట్లాడడానికి వీలు లేదని.. ప్రజల సభల్లో - సమావేశాల్లోనూ వైఎస్ వివేక హత్యపై నోరు జారవద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు టీడీపీ - వైసీపీ నేతలు ఇరువురు ఇక వైఎస్ వివేకా హత్య విషయంలో మాట్లాడమని అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఏప్రిల్ 15వరకు వివేకా హత్య విషయంలో ఎవ్వరూ మాట్లాడడానికి వీలులేదని హైకోర్టు స్పష్టం చేసింది.

ఇక ఏపీ ప్రభుత్వం ఇప్పటికే వైఎస్ వివేకా హత్య విషయంలో సిట్ విచారణకు ఆదేశించిందని.. ఆ విచారణ కొనసాగించవచ్చని కానీ ఆ వివరాలు మాత్రం ఏప్రిల్ 15వరకు ఎక్కడా బయటపెట్టవద్దని కోర్టు స్పష్టం చేసింది. ఇక ఈ హత్య విషయంలో వైఎస్ వివేకా కుటుంబసభ్యులను కూడా చంద్రబాబు ఇరికించాలని చూస్తున్నాడని.. వారిపై విచారణ ఆపివేయాలని జగన్ డిమాండ్ చేశారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు వైఎస్ వివేకా హత్య విషయంలో సిట్ దర్యాప్తు చేసి వివరాలు మాత్రం వెల్లడించవద్దని.. ఇది రాజకీయంగా నష్టం చేస్తుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నామని కోర్టు తెలిపింది.