Begin typing your search above and press return to search.
పోయెస్ గార్డెన్ ఆమెకు కావాలట
By: Tupaki Desk | 11 Jun 2017 7:34 AM GMTఅమ్మ జయలలిత అనారోగ్యంతో మొదలైన సంచలన పర్వం ఇప్పటికిప్పుడు ముగిసేలా కనిపించటం లేదు. అమ్మ మరణంతో అంతకంతకూ పెరుగుతున్న చిక్కుముడలలో మరో ముడి తాజాగా పడింది. అమ్మ మేనకోడలు దీప.. ఇప్పుడు పోయెస్ గార్డెన్ లోని వేద నిలయం తనదేనని చెబుతున్నారు. తాజాగా ఆమె పుణ్యమా అని పోయెస్ గార్డెన్ వద్ద రచ్చ రచ్చగా మారింది.
అమ్మ మేనకోడలు దీప ఈ రోజు (ఆదివారం) ఉదయం ఉన్నట్లుండి ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యారు. తన మద్దతుదారుల్ని వెంట పెట్టుకొని వచ్చిన ఆమె.. వేదనిలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న ఆమె సోదరుడు దీపక్..తన అనుచరుల్ని రంగంలోకి దిగటం.. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన పోయెస్ గార్డెన్‌కు వచ్చి.. దీపను అడ్డుకునే ప్రయత్నం చేశారు.
అమ్మకు చెందిన వేద నిలయం తనదేనని.. తాను సొంతం చేసుకుంటానని దీప చెబుతున్నారు. ఇందుకు అభ్యంతరం వ్యక్తం చేసిన పోలీసులు.. ఆమెను అడ్డుకున్నారు. దీంతో ఆమె పోలీసులపై మండిపడ్డారు. వాగ్వాదానికి దిగారు.
జయలలిత వారసుల్ని ఇంట్లోకి వెళ్లనీయకుండా ఉండటం సరికాదంటూ పోలీసుల తీరును ఆమె తప్పు పట్టారు. అమ్మ మరణం తర్వాత అమ్మ నెచ్చెలి శశికళ అధీనంతో వేదనిలయం ఉండటం.. అక్రమాస్తుల కేసులో చిన్నమ్మ జైలుకు వెళ్లటంతో ఇప్పుడా ఇంట్లో ఎవరూ ఉండటం లేదంటున్నారు. ఇదిలా ఉంటే.. తనను అమ్మ ఇంట్లోకి అనుమతించని నేపథ్యంలో ఆమరణ నిరాహారదీక్షకు పూనుకుంటానని చెబుతున్న దీప మాటలతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కినట్లైంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/