Begin typing your search above and press return to search.

మరో 3 రోజులు కస్టడీకి..అచ్చెన్నాయుడు కేసులో హైడ్రామా

By:  Tupaki Desk   |   25 Jun 2020 5:00 AM GMT
మరో 3 రోజులు కస్టడీకి..అచ్చెన్నాయుడు కేసులో హైడ్రామా
X
ఈఎస్ఐ మందుల కొనుగోలులో అవకతవకలు జరిగాయనే అభియోగంపై అరెస్ట్ అయిన మాజీ మంత్రి టీడీపీ నేత అచ్చెన్నాయుడి వ్యవహారంలో అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది. ఈనెల 25 నుంచి 27వరకు మూడు రోజుల పాటు ఏసీబీ కస్టడీకి ఇస్తూ విజయవాడ కోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రస్తుతం చికిత్స నిమిత్తం అచ్చెన్నాయుడు గుంటూరు ఆస్పత్రిలో ఉన్నారు. ఆస్పత్రి వైద్యుల నుంచి వివరాలు తెప్పించుకున్న జడ్జి ఈ మేరకు న్యాయవాది సమక్షంలో ఏసీబీ అధికారులు విచారించాలని స్పష్టం చేశారు. విచారణ సమయంలో ఇబ్బంది పెట్టరాదని సూచించింది. ఆస్పత్రిలోనే ప్రశ్నించేందుకు ఏసీబీ అధికారులకు కస్టడీకి ఇచ్చింది.

అయితే బుధవారం అర్ధరాత్రికే పరిణామాలు మారిపోయాయి. ఆసుపత్రి వర్గాలు గురువారమే అచ్చెన్నాయుడిని డిశ్చార్జి చేసేందుకు రంగం సిద్ధం చేసినట్టు తమకు తెలిసిందని అచ్చెన్నాయుడు తరుపు న్యాయవాదులు వెల్లడించారు.

కాగా గురువారం డిశ్చార్జ్ చేసి పోలీస్ కస్టడీకి తీసుకొని విచారిస్తారా? కోర్టు చెప్పినట్టు ఆస్పత్రిలోనే డిశ్చార్జ్ చేస్తారా అన్నది ఉత్కంఠగా మారింది.