Begin typing your search above and press return to search.
సత్తెన్న పల్లి లో హై డ్రామా
By: Tupaki Desk | 13 March 2019 3:31 PM GMTసత్తెన్న పల్లి ... తెలుగుదేశం సీనియర్ నాయకుడు కోడెల శివప్రసాద్ రావు సొంత నియోజకవర్గం. అక్కడ ఆయన మూడు సార్లు గెలిస్తే, రెండు సార్లు ఓడిపోయారు. ఒక రకంగా పార్టీ మొదటి నుంచి కూడా చంద్రబాబు వెంటే ఉన్నారు. అయితే ఆయన సొంత జిల్లాలోనే ఆయనకు అసమ్మతి సెగ తగిలింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆయనను లోక్ సభకు పోటీ చేయమని అడిగారు. అయితే అందుకు ఆయన ససేమిరా అన్నట్లు సమాచారం. అయితే కోడెలకు టిక్కెట్టు ఇవ్వడానికి వీలు లేదంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసనకు దిగారు. అంతేకాదు కోడెలకు సీటు ఇస్తే ఆయనకు వ్యతిరేకంగా పనిచేసి ఆయన ఓడిస్తామంటున్నారు. గుంటూరు జిల్ల సత్తెనపల్లె టిడిపి కార్యలయంలో ప్లకార్డులు ప్రదర్శించి నిరసనకు దిగారు. దీని బట్టి చూస్తే సొంత పార్టీలో కోడెలకు తన సొంత జిల్లలో, ఎంత వ్యతిరేకత ఉందో అర్దం అవుతోంది. అయితే ఇదంతా కూడా పార్టీ లోని కొందరి పెద్దల హస్తం ఉందని అంటున్నారు.
కోడెల స్వంత నియోజక వర్గం నర్సరావు పేట. ఆయన 1989 తర్వాత వరుసగా మూడు సార్లు విజయం సాధించారు. ఆ తర్వాత 2004, 2009 లో ఓడిపోయారు. ఆ తర్వాత ఆయనకు సత్తెన్న పల్లి నుంచి పోటీకి దింపింది పార్టీ అధిష్టానం. తెలుగు రాష్ట్రాలు రెండుగా చీలిపోయిన తర్వాత 2014 తన ప్రత్యర్ది అంబటి రాంబాబు పై కేవలం 700 ఓట్ల తేడాతో గెలుపొందారు. కోడెలకు నర్సరావుపెట లోక్ సభ, ఆయన కుమారుడికి కోడెల శివరామ్ కు నర్సరావు పెట అసెంబ్లీ టిక్కెట్టు ఇస్తానని చంద్రాబాబు చెప్పినట్లు సమాచారం. అయితే తనకు సత్తెన్న పల్లి సీటు కేటాయించాలి కోడెల శివప్రసాద్ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయనను కట్టడి చేయాడానికి పార్టీలో పెద్దలు వెనకుండీ ఈ డ్రామాను నడిపిస్తున్నట్లు పలువురు భావిస్తున్నారు.