Begin typing your search above and press return to search.
హై పవర్ కమిటీ నిర్ణయాల్లో అదే హైలైట్
By: Tupaki Desk | 8 Jan 2020 4:20 AM GMTఏపీ రాజధాని విషయంలో హైపవర్ కమిటీ ప్రభుత్వ ఉద్దేశాలకు అనుగుణం గానే నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిందేనని హైపవర్ కమిటీ అభిప్రాయ పడింది. మూడు రాజధానుల అవసరం ఉందని స్పష్టం చేసింది. మంగళవారం రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అధ్యక్షతన హైపవర్ కమిటీ తొలి సమావేశం జరిగింది. సమావేశం అనంతరం ఆ వివరాలను మీడియా కు వివరించారు మంత్రి. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి ఏ విధంగా జరగాలి? అన్ని ప్రాంతాల అభివృద్ధి ఎలా ఉండాలి? అనే అంశాలపై జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదిక, బీసీజీ నివేదిపై సుదీర్ఘంగా చర్చించామని బుగ్గన తెలిపారు. ప్రస్తుతం అభివృద్ధి వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణ పై రాష్ట్రంలో చర్చలు జరుగుతున్నాయని.. కమిటీలు ఇచ్చిన నివేదికలు విశ్లేషించుకొని ముందుకు వెళ్లేందుకే ఈ హైపర్ కమిటీ ని సీఎం ఏర్పాటు చేశారని వెల్లడించారు. సుదీర్ఘం గా 4 గంటల పాటు సాగిన హై పవర్ కమిటీ తొలి సమావేశం జరిగింది.
మిచ్చిన నివేదికల సారాంశాన్ని జీఎన్ రావు, బీసీజీ ప్రతినిధులు హైపవర్ కమిటీ కి వివరించారు. విశాఖ నగరాన్నే రాజధాని గా ఎందుకు ఎంచుకున్నారని ఈ సందర్భం గా మంత్రులు ప్రశ్నించారు. గ్రీన్ ఫీల్డ్ రాజధాని నిర్మాణానికి అయ్యే ఖర్చును ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ భరించ లేదనే విషయాన్ని తమ అధ్యయనం లో వెల్లడైందని వారు చెప్పారు. ఏపీలో విశాఖ కేంద్రంగా పరిపాలన సాగిస్తే రాష్ట్రాభివృద్ధికి చోదక శక్తి అవుతుందని మంత్రుల అభిప్రాయపడ్డారు. అంతేకాదు అమరావతి ప్రాంత అభివృద్ధి పై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని హైపర్ కమిటీ అభిప్రాయ పడింది. రాజధాని రైతుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని.. రైతుల ముందు రెండు-మూడు ఆప్షన్లను ఉంచాలని నిర్ణయించింది.
పవర్ కమిటీ మరోసారి సమావేశం నిర్వహించి పూర్తి స్థాయి లో విశ్లేషణ చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుందని బుగ్గన రాజేంద్ర నాథ్ తెలిపారు.జీఎస్ రావు, బీసీజీ నివేదికల పై అధ్యయనం చేసి 21 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించడం తో ఈ సమావేశం నిర్వహించారు. సోమవారమే హైపవర్ కమిటీ భేటీ జరగాల్సి ఉన్నా కొంతమంది మంత్రులు అందుబాటు లో లేక పోవడంతో ఇవాళ సమావేశం ఏర్పాటు చేశారు. రాజధానిపై కమిటీలు ఇచ్చిన నివేదికలపై హైపవర్ కమిటీ సమగ్రంగా చర్చించింది.