Begin typing your search above and press return to search.
విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన ..నివేదిక సమర్పించిన హైపర్ కమిటీ !
By: Tupaki Desk | 6 July 2020 1:00 PM GMTవిశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ తుది నివేదికను ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి అందించింది. సీఎం క్యాంప్ కార్యాలయంలో సోమవారం ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన కమిటీ సభ్యులు, గ్యాస్ లీకేజీ ప్రాంతాల్లో పర్యటించి పూర్తిస్థాయిలో అధ్యాయనం చేసి నివేదికను సమర్పించారు. అటవీ పర్యావరణం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ నేతృత్వంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా, కలెక్టర్ సభ్యులుగా హైపవర్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
మే 7న ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్ లీక్ ప్రమాదం జరిగిన తీరు, భవిష్యత్ లో ఇటువంటి ప్రమాదాలు మరోసారి పునరావృత్తం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు, సలహాలను కమిటీ తన నివేదికలో పొందుపరిచింది. అలాగే ప్రభావిత గ్రామాల బాధిత ప్రజలు, రాజకీయ పార్టీల నేతలు, సీనియర్ జర్నలిస్ట్ లు, అధికారులతో హైపవర్ కమిటీ చర్చించింది. నివేదిక సమర్పన సందర్భంగా విశాఖ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ వినయ్ చంద్, నగర కమిషనర్ ఆర్కే మీనా పాల్గొన్నారు.
కాగా విశాఖ నగరంలోని గోపాలపట్నం శివారు ఆర్ ఆర్ వెంకటాపురం గ్రామంలోని బహుళజాతి కంపెనీ ఎల్ జీ పాలిమర్స్ లో మే 7 వేకువజామున 3.30 గంటల ప్రాంతంలో పెద్దఎత్తున విషవాయువు లీకై 12 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించిన సంగతి తెలిసిందే.