Begin typing your search above and press return to search.

మరోసారి భేటీ కానున్న హైపవర్ కమిటీ... అమరావతి పైనే చర్చ !

By:  Tupaki Desk   |   10 Jan 2020 6:23 AM GMT
మరోసారి భేటీ కానున్న హైపవర్ కమిటీ... అమరావతి పైనే చర్చ !
X
ఆంధప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధి పై ఏర్పాటైన హై-పవర్ కమిటీ నేడు రెండోసారి భేటీ కానుంది. ఈరోజు సమావేశం కానున్న 16 మంది సభ్యులతో కూడిన హై-పవర్ కమిటీ ప్రధానంగా అమరావతి అభివృద్ధిపై చర్చించనుంది.అలాగే ఈ భేటీలో అమరావతి పై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. రాజధాని ఏర్పాటు పై జీఎన్ రావు కమిటీ, బోస్టన్ నివేదికలని నిశితం గా పరిశీలించి ఈ నెల 20 న ఈ హై పవర్ కమిటీ సీఎం జగన్ కి పూర్తి నివేదిక ఇవ్వనుంది.

అయితే , ప్రస్తుతం రాజధానిని అమరావతిలోని ఉంచాలంటూ అమరావతి ప్రాంత ప్రజలు ఆందోళనలు చేస్తున్న సమయంలో , వారి సమస్యలని తీర్చే విధంగా ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని సభ్యులందరికీ సమాచారం అందించారు. ఈరోజు జరగనున్న సమావేశంలో అమరావతి సమగ్రాభివృద్ధి తో పాటు భూములు ఇచ్చిన రైతుల్ని ప్రభుత్వం ఎలా ఆదుకోవాలనే అంశం పై కీలకంగా చర్చిస్తారు. రాజధాని పేరట అమరావతి రైతులని మోసం చేసి, వాళ్లకు అరచేతిలో స్వర్గం చూపించి, ల్యాండ్ పూలింగ్ పేరిట భూములు లాక్కున్నారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు.

ఆ తరువాత ఆ భూములని తనకి కావాల్సిన వారికీ అప్పలంగా కాట్టబెట్టారు. దీనితో ఐదేళ్లలో రాజధాని ప్రాంతం అంగుళమైనా అభివృద్ధి చెందలేదు, భూములిచ్చిన రైతులకు పూర్తిస్థాయిలో పరిహారం అందలేదు. అమరావతి అభివృద్ధి గాల్లో దీపంగా మారింది. అప్పట్లో బాబు చేసిన అరాచకాలన్నీ ఇప్పుడు జగన్ కు తలనొప్పిగా మారాయి. గత ప్రభుత్వం ప్రకటించినట్టుగా రైతులకు పరిహారం అందించడంతో పాటు అమరావతిని అభివృద్ధి చేసే బాధ్యతను ఇప్పుడు జగన్ తీసుకున్నారు. రైతులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా, వాళ్లు నష్ట పోకుండా మంచి ప్యాకేజీలు అందించే దిశగా హై పవర్ కమిటీ కొన్ని సూచనలు చేయబోతోంది. దీనితో ప్రస్తుతం అమరావతి రైతుల దృష్టి మొత్తం ఈరోజు జరగబోయే హై పవర్ కమిటీ భేటీపైనే ఉంది. అయితే , ఈ రోజు భేటీలో హైపవర్ కమిటీ తీసుకునే కీలక నిర్ణయాలు మాత్రం ..హైపవర్ కమిటీ పూర్తి నివేదికని సీఎం కి అప్పగించిన తరువాతనే వెలువడే అవకాశం ఉంది. ఈ నెల 20వ తేదీన తుది నివేదికను ముఖ్యమంత్రి జగన్ కు హైపవర్ కమిటీ అందిస్తుంది. ఆ నివేదిక ఆధారంగా కేబినెట్ లో చర్చించి, ఆ తర్వాత ఈ హైపవర్ కమిటీ నిర్ణయాల్ని వెల్లడిస్తారు.