Begin typing your search above and press return to search.
లేడీసంతా కలిసి లోకేశ్ ను మంత్రిని చేస్తున్నారు..
By: Tupaki Desk | 27 Aug 2016 9:46 AM GMTఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు లోకేశ్ కు ఈసారి మంత్రి పదవి దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. చంద్రబాబే ఈ మేరకు సిగ్నళ్లు ఇవ్వడంతో చిన్నబాబుకు పెద్ద పదవి వచ్చేసినట్లేనని టీడీపీ వర్గాలు సంబరపడుతున్నాయి. లోకేశ్ బాగా పనిచేస్తున్నారని... మంత్రిగా అవకాశమిస్తే ఇంకా బాగా పనిచేస్తారని... ఆ దిశగా ఆలోచిస్తున్నామని చంద్రబాబు ఓ ఛానల్ ఇంటర్వ్యూలో అన్నారు. దీంతో లోకేశ్ కు పదవి ఖాయమని తేలింది. నిజానికి ఇప్పుడప్పుడే ఆయన్ను మంత్రిని చేయాలని చంద్రబాబు అనుకోలేదట. కానీ... ఇంట్లో లేడీస్ మాత్రం చంద్రబాబును తెగ ప్రెజర్ చేసి లోకీకి పదవి ఇప్పిస్తున్నారని తెలుస్తోంది.
లోకేష్ ను మంత్రివర్గంలోకి తీసుకుంటే పవర్ సెంటర్లు తయారవుతాయన్న భావన చంద్రబాబుకు ఉన్నప్పటికీ… చంద్రబాబు భార్య భువనేశ్వరితో పాటు కోడలు బ్రాహ్మణి కూడా లోకేష్ కు మంత్రిపదవి ఇవ్వాల్సిందేనని ఒత్తిడి తెస్తున్నారని పార్టీ వర్గాల సమాచారం. అల్లుడు మంత్రి అయితే బాగుంటుందని బాలకృష్ణ భార్య వసుంధర కూడా కోరుకుంటున్నారట... కోరుకోవడమే కాదు బాలకృష్ణపై ఒత్తిడి చేసి చంద్రబాబుపై ఒత్తిడి పెంచేలా చేస్తున్నారని సమాచారం. ఇటు చంద్రబాబు - అటు బాలయ్య కుటుంబాల్లోని ఆడోళ్లంతా కలిసి లోకేశ్ కు పదవి ఇవ్వాలని చంద్రబాబుకు తెగ సిఫార్సు చేస్తుండడంతో ఆయన కాదనలేకపోయారని టాక్.
భార్య మాటలను చంద్రబాబు కొట్టిపారేయగలిగినా కొత్తగా కోడలు బ్రాహ్మణి మాట మాత్రం చంద్రబాబు కాదనలేకపోతున్నారట. అటు మనవడు దేవాన్సుతో గడపకుండా ఇటు లోకేశ్ కు పదవి ఇవ్వకుండా మొత్తానికే పట్టించుకోవడం లేదన్నట్లుగా బ్రహ్మణి కోరేటప్పటికి చంద్రబాబు విధిలేని పరిస్థితుల్లో కుమారుడు లోకేశ్ ను అమాత్యుడిని చేస్తున్నట్లు టీడీపీ వర్గాల్లో టాక్.