Begin typing your search above and press return to search.

ఉద్యోగం : వ‌త్తిళ్ల‌తో మొద‌టికే మోసం

By:  Tupaki Desk   |   7 Jun 2018 1:30 AM GMT
ఉద్యోగం : వ‌త్తిళ్ల‌తో మొద‌టికే మోసం
X
పురుషులు, మ‌హిళ‌ల‌తో పోలిస్తే ఉద్యోగ జీవితంలో ఎక్కువ వ‌త్తిళ్లు ఎదుర్కొనేది పురుషులే. అయితే ఈ వ‌త్తిళ్ల మూలంగా పురుషులు అకాల మ‌ర‌ణానికి గుర‌వుతున్నార‌ని ఓ స‌ర్వే వెల్ల‌డించింది. గుండె స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే పురుషులు ఉద్యోగంలో వ‌త్తిడికి గురై మ‌ర‌ణించే అవ‌కాశం మ‌హిళ‌ల‌తో పోలిస్తే ఆరురెట్లు అధికం అని ఆ నివేదిక స్ప‌ష్టం చేసింది. 14 ఏళ్ల పాటు లక్ష మంది వైద్య రికార్డులను పరిశీలించిన మీదట పరిశోధకులు ఈ వివ‌రాల‌ను విడుద‌ల చేశారు.

మ‌హిళ‌ల‌క‌న్నా పురుషులు ఉద్యోగ జీవితంలో వ‌చ్చే వ‌త్తిళ్ల మూలంగా వారి గుండె ధ‌మ‌నుల్లో ర‌క్తం గ‌డ్డుకుపోయే అవ‌కాశం అధికంగా ఉండ‌డ‌మే ఈ అకాల మ‌ర‌ణాల‌కు కార‌ణం ప‌రిశోధ‌కులు వెల్లడించారు. మహిళలు మొనోపాజ్‌ దశకు ముందు గుండె సమస్యలకు లోనవడం చాలా త‌క్కువ‌ని, పురుషులు ఈ ముప్పు నుండి త‌ప్పించుకునేందుకు ప‌ని గంట‌ల త‌గ్గింపు, వ‌త్తిడిని అధిగ‌మించే ర్య‌లు చేప‌ట్ట‌డం మూలంగా ఈ స‌మ‌స్య నుండి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చ‌ని ఈ అధ్య‌య‌నంలో పాల్గొన్న యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌కు చెందిన ప్రొఫెసర్‌ మికా సూచించారు.

ఉద్యోగంలో వ‌త్తిళ్లు ఎదుర్కొనే పురుషులు ముఖ్యంగా డ‌యాబెటిస్ - క‌రోన‌రీ హార్ట్ డిసీజ్ - స‌ర్డోక్ కు దారి తీసి అకాల మ‌ర‌ణానికి చేరువ చేస్తాయ‌ని ఈ ప‌రిశోధ‌న‌లో వెల్ల‌డ‌యిన‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు. కేవ‌లం బ్ల‌డ్ ప్రెష‌ర్ - కొలెస్ట‌రాల్ - డ‌యాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడం మూలంగా వ‌త్తిడిని జ‌యిస్తాం .. ఎలాంటి ఆరోగ్య స‌మ‌స్య‌లు ఉండ‌వ‌ని భావించ‌డం స‌రికాద‌ని ప‌రిశోధ‌న‌లో తేలింది. ఉద్యోగంలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొనే పురుషులు శారీరకంగా దృఢంగా ఉండి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నా ఈ ముప్పు అధికమని పరిశోధన హెచ్చరించింది.