Begin typing your search above and press return to search.
ఓ మై హార్ట్.. యువకుల్లోనే గుండెపోటు రిస్క్ ఎక్కువట
By: Tupaki Desk | 3 Jun 2022 5:13 AM GMTగుప్పెడంత గుండెకు ఎన్ని ముప్పులో... చిన్నా పెద్దా తేడా లేకుండా ఎంతో మందిని కబళిస్తున్న అతి పెద్ద సమస్య గుండెపోటు. ముఖ్యంగా భారత్ యవతను గుండెపోటు టెన్షన్ పెడుతోంది. ఫిట్గా ఉన్నా.. ఫ్యాట్గా ఉన్నా.. ఎవరికి ఏ సమయంలో ఎలా వస్తుందో అర్థం కావడం లేదు. హఠాత్తుగా గుండెపోటు వచ్చి అక్కడికక్కడే కూలి పోతున్నారు చాలా మంది. కనీసం ప్రాథమిక చికిత్స చేయడానికి కూడా వీల్లేకుండా మృత్యు ఒడిలో ఒదిగిపోతున్నారు. ఈ గుండెపోటు బారిన పడుతున్న వారిలో భారతీయ యువతే ఎక్కువగా ఉంటోందని వైద్య గణాంకాలు చెబుతున్నాయి. ఇండియాతో పాటు దక్షిణాసియా దేశాలకూ హార్ట్ఎటాక్ టెన్షన్ పట్టుకుందని తెలిపాయి.
గుండెపోటు.. ప్రస్తుతం భారతీయ యువతను టెన్షన్ పెడుతున్న వ్యాధి. ఉరుకుల పరుగుల జీవితంలో తీరిక లేకుండా గడుపుతున్న జీవైనశైలి యువ హృదయాల్లో చిచ్చుపెడుతోంది. పట్టుమని పాతికేళ్లు కూడా లేనివారు సైతం గుండెపోటుతో చనిపోతున్నారు.
అస్తవ్యస్తమైన జీవనశైలితో పాటు వృత్తిపరమైన, వ్యక్తిగతమైన టెన్షన్లు.. కాస్త కూడా శారీరక శ్రమ లేకపోవడం.. పొగతాగడం, మద్యం సేవించడం, జంక్ఫుడ్, కొలెస్ట్రాల్, షుగర్ వంటివి గుండెపోటుకు దారి తీస్తున్నాయి. ఆక్సిజన్ అధికంగా ఉండే రక్తాన్ని తీసుకువెళ్లే ధమనులు పనిచేయకపోతే.. రక్త ప్రవాహానికి అంతరాయం కలిగి రక్త ప్రసరణ నిలిచిపోతుంది.
ఫలితంగా గుండెపోటు వస్తుంది. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే ఇది మనదేశంలో పదేళ్ల ముందుగానే దాడి చేస్తోంది. దీని బారిన పడుతున్న వారిలో సుమారు 50% మంది 50 ఏళ్ల లోపువారే! ఎంతోమంది చిన్నవయసులోనే దీనికి బలైపోతున్నారు.
భారత యువతతో పాటు దక్షిణాసియా దేశాల యువతనూ గుండెపోటు టెన్షన్ పెడుతోంది. దక్షిణాసియా దేశాల్లో 7 శాతం జనాభా ను హార్ట్ఎటాక్ భయం వెంటాడుతోందని గణాంకాలు చెబుతున్నాయి. తెలంగాణలో పురుషుల్లోనే గుండె జబ్బుల ముప్పు 20.3 శాతంగా ఉందని.. మహిళల్లో 8.3 శాతం ఉందని వెల్లడించాయి. సగటున గుండె జబ్బుల ముప్పు మగాళ్లలో 21.4 శాతం, మహిళల్లో 12.7 శాతంగా ఉందని తెలిపాయి.
సాధారణంగా గుండెపోటు 50 ఏళ్లు పైబడిన వారిలో వచ్చేది. కానీ ఇప్పుడు పాతికేళ్లలోపు వాళ్లని కూడా మృత్యు ఒడిలోకి చేరుస్తుంది గుండెపోటు. ప్రతి ఐదుగురిలో ఒకరు.. 40 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారే హార్ట్ ఎటాక్ బారిన పడుతున్నారని వైద్యనిపుణులు చెబుతున్నారు. 2000, 2016 మధ్య ఈ చిన్న వయస్సులో గుండెపోటుల రేటు ప్రతి ఏడాది 2శాతం పెరుగుతూ వస్తోంది. కరోనరీ హార్ట్ డిసీజ్ (CHD), ఇతర సమస్యలతో పాటు, మయోకార్డియల్ ఇన్ఫాక్షన్(MI)కి దారితీయవచ్చని నిపుణులు అంటున్నారు. ఇదే ఆకస్మిక మరణానికి దారితీస్తుందని చెబుతున్నారు.
మయోకార్డియల్ ఇన్ఫాక్షన్(MI) నిర్ధారణ :
మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ (MI) నిర్ధారించడానికి, రక్తపోటు, పల్స్ రేటు, ఈసీజీ, ఎకో కార్డియోగ్రఫీ ట్రోపోనిన్ పరీక్ష వంటి క్లినికల్ పరీక్షలు చేయించుకోవాలి. మీ లక్షణాలను బట్టి మెడికల్ హిస్టరీని పరిశీలిస్తారు. గుండెపోటు ఒకసారి వచ్చిన తర్వాత ఈజీగా తగ్గదు. మళ్లీ ఎప్పుడైనా రావొచ్చు. అందుకే దీనికి సరైన చికిత్సను తీసుకోవాలి.
ఆహారం, జీవనశైలిలో మార్పులు, కొన్ని జాగ్రత్తలతో చిన్న వయసులో గుండెపోటు ముప్పును తగ్గించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటంటే..
ఫైబర్ అధికంగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవడం
సోడియం & ఉప్పు వినియోగాన్ని తగ్గించడం
ప్యాక్ చేసిన ఆహారాన్ని నివారించడం.
రక్తంలో చక్కెర స్థాయి, రక్తపోటు స్థాయిలు, కొలెస్ట్రాల్‌ను తరచూ చెక్ చేస్తూ అసాధారణంగా ఉంటే వెంటనే సరైన చికిత్స తీసుకోవడం
ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండటం
ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడం
ప్రతి రోజూ అరగంట పాటు వ్యాయామం, ధాన్యం వంటివి చేయడంతో గుండెపోటును కాస్త కట్టడి చేయొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.