Begin typing your search above and press return to search.
మహిళా ఉద్యోగులు: ఓ నిజం
By: Tupaki Desk | 4 Nov 2015 8:39 AM GMT''లేచింది... నిద్ర లేచింది మహిళా లోకం'' అంటూ దశాబ్దాల కిందటే ఎన్టీఆర్ తెలుగు తెరపై పాటలు పాడి మహిళా సత్తాను కీర్తించారు. ప్రస్తుత కాలంలో మహిళలు అన్ని రంగాల్లో సాధిస్తున్న ప్రగతిని మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఒకరకంగా సమాజంలో చాలామంది పురుషులు మహిళల వద్దే పనిచేస్తున్నారు. పొద్దున్నే రోడ్డుపైకి వచ్చి చూస్తూ ఉద్యోగాలకు వెళ్తున్న మహిళలు కోకొల్లలుగా కనిపిస్తారు. అయితే.. మహిళా ఉద్యోగులు ఇంతగా పెరిగిపోయారని మనం అనుకుంటున్నాం కానీ... వాస్తవం వేరుగా ఉంది. భారత దేశంలో మహిళా ఉద్యోగులు చాలా తక్కువని.. ఆ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి.
భారతదేశంలో పనిచేస్తేన్న స్త్రీల శాతం కేవలం 31 శాతం మాత్రమేనని ఇటీవల మెక్ నీ నివేదిక వెల్లడించింది. 2025 నాటికి 41 శాతం మంది స్త్రీలు పనిచేస్తారని ఈ నివేదిక అంచనా వేస్తోంది. మహిళా ఉద్యోగుల సంఖ్య పెరిగినప్పుడే దేశ ఆర్థిక వ్యవస్ద మరింత మెరుగవుతుందన్న విషయాన్ని నివేదిక స్పష్టం చేసింది . భారత ఆర్దిక వ్యవస్థపై మహిళల ప్రభావం 17 శాతం ఉందని చెప్పిన ఈ నివేదిక ప్రపంచ వ్యాప్తంగా ఈ సగటు 37 శాతం అని వెల్లడించింది. అంటే ప్రపచంలో 37 శాతం స్త్రీలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నారన్న మాట.
ఈ లెక్కన మహిళల ఉద్యోగాల విషయంలో భారత్ ఇంకా చాలావెనుకబడి ఉందని అర్థమవుతోంది. వారికి కల్పిస్తున్న 33 శాతం రిజర్వేషన్ల కంటే కూడా తక్కువగా 31 శాతం మందే ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రభుత్వ - ప్రైవేటు అనే తేడా లేకుండా అన్ని సంస్థల్లో మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించాలని... వారికి కొన్ని మినహాయింపులు కల్పిస్తే ఉద్యోగం చేసే మహిళల సంఖ్య మరింత పెరుగుతుందని మెక్ నీ నివేదిక పేర్కొంది.
సో.... ఆడవాళ్ల నుంచి వస్తున్న పోటీవల్లే తమకు ఉద్యోగాలు రావడం లేదని అనుకుంటున్న కుంటిసాకుల నిరుద్యోగులూ మీ మాటలు ఏమాత్రం నిజం కావని మీ మనసుకు చెప్పుకోండి.. అంతేకాదు.. ఇప్పటికైనా ఉద్యోగాలు సంపాదించుకోండి. లేదంటే ముందుముందు మహిళలు మరింత పోటీ ఇస్తారు మీకు.