Begin typing your search above and press return to search.

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ మెట్రోలో హైస్పీడ్ ఇంటర్నెట్!

By:  Tupaki Desk   |   28 April 2022 3:30 AM GMT
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ మెట్రోలో హైస్పీడ్ ఇంటర్నెట్!
X
హైదరాబాద్ మెట్రో రైల్లో ప్రయాణిస్తూ.. ఇకపై ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. వాట్సాప్ నుంచి ఫేస్ బుక్ వరకు ఎవైనా చూసేయొచ్చు. మీకు నచ్చి కామెడీ వీడియో నుంచి హర్రర్ సినిమాల వరకు ఏవైనా డౌన్ లోడ్ కూడా చేసుకోవచ్చు. అది కూడా చాలా ఫాస్ట్ గా. అలాగే సినిమా దగ్గర నుంచి షాపింగ్ వరకు ఏదైనా చేసుకోవచ్చు. చేస్కోవచ్చు కానీ.. మా దాంట్లో నెట్ లేదు, సరిగ్గా రావట్లేదని అంటారా.. అయితే అలాంటి సమ్యలకు చెక్ పెడుతూ.. మెట్రోలో ఫ్రీ హై స్పీడ్ నెట్ కనెక్షన్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఇందుకు అనుగుణంగా షుగర్ బాక్స్ సంస్థ మెట్రో రైళ్లలో తన హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను విస్తృత పరిచింది. 2019 లోనే హైదరాబాద్ మెట్రో తో అనుసంధానం అయిన షుగర్ బాక్స్ సంస్థ ప్రస్తుతం అంతరాయం లేని హైస్పీడ్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. అమీర్ పేట లోని మెట్రో స్టేషన్ లో మంగళవారం షుగర్ బాక్స్ సంస్థ తన డిజిటల్ హై స్పీడ్ కనెక్టివిటీ సేవలను ప్రవేశ పెట్టింది.

ఇందుకు గాను పేటెంట్ క్లౌడ్ ఫ్రాగ్ మెంట్ సాంకేతికతను వినియోగించుకుంటున్నాం అని షుగర్ బాక్స్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. షుగర్ బాక్స్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవడం ద్వారా మెట్రో రైళ్లలో ఉచితంగా వినోద కార్యక్రమాలు వీక్షించే వీలు ఉందని అన్నారు. అయితే చాలా మంది పబ్లిక్ ప్లేస్ లలో కల్పించే వైఫై సేవులను వినియోగించుకోవడం వల్ల చాలా సమస్యలు వస్తాయని చెబుతుంటారు. కానీ అలాంటి సమస్యలేం లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు మెట్రో అధికారులు వివరిస్తున్నారు.

హైదరాబాద్ మెట్రో అందించే ఈ అవకాశాలన్నింటిని ప్రయాణికులు హాయిగా సద్వినియోగం చేసుకోవాలని చెబుతున్నారు. విషయం తెలుసుకున్న ప్రజలంతా మెట్రోలో హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలు వినియోగించుకునేందుకు తహతహలాడుతున్నారు. మెట్రోలో సిగ్నల్స్ సమస్యలు వచ్చేవని.. ఇప్పుడు హై స్పీడ్ ఇంటర్నెట్ కల్పించడం ద్వారా చక్కగా తమకు కావాల్సిన పనులు చేసుకోవచ్చని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాకుండా మెట్రోలో ప్రయాణం చేసేటప్పుడు తమ పనులను కూడా రైళ్లో ఉండే చేసుకోవచ్చని మురిసిపోతున్నారు. రైళ్లో ప్రయాణిస్తూనే పనులతో పాటు తనకు నచ్చిన సినిమాలు, వీడియోలు, పాటలు, రియాల్టీ షోలు.. ఇలా తమకు నచ్చినవి చూస్కోవచ్చని చెబుతున్నారు. మెట్రోలో హై స్పీడ్ ఇంటర్నెట్ కల్పిస్తున్నందుకు షుగర్ బ్యాక్ సంస్థకు ధన్యవాదాలు తెలుపుతున్నారు.