Begin typing your search above and press return to search.

అసెంబ్లీ ముట్టడి.. అమరావతిలో హైటెన్షన్

By:  Tupaki Desk   |   20 Jan 2020 4:14 AM GMT
అసెంబ్లీ ముట్టడి.. అమరావతిలో హైటెన్షన్
X
ఏపీ రాజధాని మార్పు కోసం చేస్తున్న ఆందోళనలు పతాక స్థాయికి చేరుకున్నాయి. సోమవారం అమరావతి ఐకాస-జేఏసీ, వామపక్షాలు అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అమరావతి జేఏసీ ముట్టడి నేపథ్యంలో 6000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేసింది పోలీస్ యంత్రాంగం. ఎక్కడికక్కడ ఆంక్షలతో నిరసనలు అణచివేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మూడు రోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాల దరిదాపుల్లోకి ఈగ కూడా వాలకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రకాశం బ్యారేజీని మూసివేశారు.

అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో పోలీసులు టీడీపీ ఎమ్మెల్యేలు - నేతలు - వామపక్ష పార్టీల నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి నుంచే అరెస్ట్ లకు దిగడంతో టెన్షన్ నెలకొంది.

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అడుగడుగునా పోలీస్ తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీసులు. ప్రతి వాహన్నాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులను సైతం తనిఖీలు చేస్తున్నారు. ప్రతి గ్రామ కూడళ్ల వద్ద ఫెన్సింగ్ తో పోలీస్ పహారా కాస్తున్నారు.

ఇక ఆందోళనల నేపథ్యంలో వజ్ర,గ్యాస్ పార్టీ -ఫైర్ ఇంజన్ వాహనాలను సచివాలయం వద్ద అందుబాటులో ఉంచింది పోలీస్ యంత్రాంగం. సచివాలయంతో సహా తుళ్లూరు మండలం మొత్తం 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పోలీస్ చట్టం 30 అమలు చేస్తున్నారు. దీంతో అమరావతిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.