Begin typing your search above and press return to search.
‘‘అమ్మ’’పై నరాలు తెగిపోయే సస్పెన్స్
By: Tupaki Desk | 5 Dec 2016 4:12 AM GMTగడిచిన 74 రోజులుగా చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం సీరియస్ అయినట్లుగా ఆదివారం రాత్రి 9గంటల వేళలో బ్రేకింగ్ న్యూస్ గా బయటకు వచ్చింది. అమ్మ ఆరోగ్యానికి సంబంధించి అమావాస్యకో.. పౌర్ణానికో కానీ హెల్త్ బులిటెన్ విడుదల చేయని అపోలో.. అందుకు భిన్నంగా ఆదివారం రాత్రి వేళ మాత్రం హడావుడిగా హెల్త్ బులిటెన్ ను విడుదల చేయటం గందరగోళానికి గురి చేసింది.
అమ్మకు హటాత్తుగా గుండెపోటు వచ్చిందని.. ఆమెను సాధారణ వార్డు నుంచి ఐసీయూ వార్డుకు తరలించినట్లుగా పేర్కొన్నారు. ఇదేమీ భయం కలిగించే అంశం కానప్పటికీ.. ఆ ప్రకటన అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు గతానికి భిన్నంగా ఉండటంతో పాటు.. లేనిపోని సందేహాలు కలిగేలా చేస్తున్నాయని చెప్పక తప్పదు. అమ్మ ఆరోగ్యం గతంలోనూ సీరియస్ గా ఉన్నప్పటికీ చోటు చేసుకోని పరిణామాలు తాజాగా మాత్రం చోటు చేసుకోవటం అమ్మ అభిమానులకు ఆందోళన కలిగించటంతో పాటు.. కంట కన్నీరు కారేలా చేస్తున్నాయి.
సందేహంగా మారిన పరిణామాలు ఇవే..
= ఆసుపత్రి వద్దకు భారీగా అదనపు బలగాలు మొహరించటం
= రాత్రి పది గంటలు దాటిన తర్వాత మహారాష్ట్రలో ఉన్న తమిళనాడు ఇన్ ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు హుటాహుటిన చెన్నైకి రావటం
= అపోలో ఆసుపత్రికి వచ్చి.. రాజ్ భవన్ కు వెళ్లటం
= పెట్రోల్ బంకులు ఈ రోజు బంద్ చేయటం.. స్కూళ్లకు సెలవు ప్రకటించటం
= రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసులకు సెలవులు రద్దు చేయటం. సెలవుల్లో ఉన్న పోలీసులు వాటిని రద్దు చేసుకొని వెంటనే డ్యూలో జాయిన్ అవ్వాలని ఆదేశాలుజారీ చేయటం.
= తొమ్మిది పాటూన్ల సైనిక బలగాల్ని మొహరించటం
= రాష్ట్రానికి అదనపు బలగాల్ని పంపాల్సిందిగా కేంద్రం నిర్ణయించటం
= తమిళనాడు రాష్ట్ర డీజీపీ మధురైలో ఉండగా.. ఆదివారం రాత్రి పదకొండు గంటల వేళ.. హుటాహుటిగా బయలుదేరి రావటం
= ఇంతకాలం సంయమనంతో వ్యవహరించిన అమ్మఅభిమానులు తొలిసారి.. ఆసుపత్రిలోకి వెళ్లే ప్రయత్నం చేయటం.. వారిపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేయటం..
= తమిళనాడు రాష్ట్ర మంత్రివర్గం అర్థరాత్రి వేళ.. అత్యవసరంగా సమావేశం కావటం
= తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావుకు కేంద్రమంత్రి రాజ్ నాథ్ ఫోన్లో మాట్లాడటం
= భద్రతా వలయంలోకి అపోలో ఆసుపత్రి వెళ్లిపోవటం
= శాంతిభద్రతలు తప్పకుండా చూడాలంటూ పోలీసులకు గవర్నర్ ఆదేశాలు జారీ చేయటం
= అమ్మ త్వరగా కోలుకోవాలంటూ భారత రాష్ట్రపతితో సహా.. ప్రధాని మోడీ రాత్రి వేళ ట్వీట్లు చేయటం
=అపోలో ఆసుపత్రి ఛైర్మన్ కు కేంద్రమంత్రి జెడ్డా ఫోన్ చేసి వివరాలు సేకరించటం
= భారీగా పారా మిలటరీ దళాల్ని మొహరించటం
= తమిళనాడు ప్రధాన నగరాలు అన్నింటిలోనూ పోలీసు బలగాలతో మొహరించటం
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/