Begin typing your search above and press return to search.

ఉత్త‌రం.. కోసం ఒంట‌రి పోరు.. ఆ బీజేపీ నేత‌కు ఏం జ‌రుగుతుంది?

By:  Tupaki Desk   |   30 Dec 2021 5:32 AM GMT
ఉత్త‌రం.. కోసం ఒంట‌రి పోరు.. ఆ బీజేపీ నేత‌కు ఏం జ‌రుగుతుంది?
X
విశాఖ ఉత్త‌ర నియోజ‌క‌వ‌ర్గం. కొన్ని నెల‌లుగా.. రాజ‌కీయ వ‌ర్గాల మ‌ధ్య హాట్ టాపిక్‌గా మారిన నియోజ‌క వ‌ర్గం. ఎందుకంటే.. ఇక్క‌డ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలోనూ క‌నిపించ‌డం లేదు.. ఇటు స‌భ‌లో నూ క‌నిపించ‌డం లేదు. దీంతో అస‌లు.. ఆయ‌న ఇక్క‌డ నుంచి గెలిచారా? అస‌లు మా ఎమ్మెల్యే ఎవ‌రు? అని ఇక్క‌డి వారు ప్ర‌శ్నించుకుంటున్నారు. ఇదిలావుంటే.. మ‌రోవైపు..ఇ క్క‌డ నుంచి 2014లో విజ‌యంద‌క్కించుకున్న‌బీజేపీ నాయ‌కులు.. విష్ణుకుమార్ రాజు.. మ‌రోసారి ఇక్క‌డ గెలుపు గుర్రం ఎక్కేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే.. ఆయ‌న వ్యూహాత్మంగా అడుగులు వేస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృతంగా ప‌ర్య‌టిస్తు న్నారు. స్థానికులకు ఓటేయాల‌ని ఆయ‌న పిలుపునిస్తున్నారు. అంటే..ప‌రోక్షంగా ఆయ‌న గంటాను ఆయ‌న టార్గెట్ చేస్తున్నారు. అదేస‌మ‌యంలో ఏ క‌ష్టం వ‌చ్చినా.. కొంత మేర‌కు ఆదుకుంటున్నారు. అయితే.. ఆయ‌న‌కు పార్టీ ప‌రంగా రెండు చిక్కులు వ‌చ్చాయి. ఒక‌టి.. ఆయ‌న‌కు పార్టీ నుంచి పెద్ద‌గా స‌హ‌కారం లేక‌పోవ‌డమే! దీనికి కార‌ణం.. ఆయ‌న గ‌తంలో టీడీపీకి స‌హ‌క‌రించార‌నే వాద‌న ఇప్ప‌టికీ వినిపిస్తోంది. అంటే.. ఆయ‌న‌పై టీడీపీ ముద్ర ఇప్ప‌టికీ కొన‌సాగుతోంది. దీనిని బీజేపీలోని కొంద‌రు కీల‌క నేత‌లు జీర్నించుకోలేక పోతున్నారు.

సో.. దీంతో విష్ణు పార్టీలోనే ఉన్నా ఆయ‌న‌కు స‌హ‌క‌రించే నాయ‌కులు మాత్రం క‌నిపించ‌డం లేదు. ఇక‌, నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్యటిస్తుంటే.. ఆయ‌న‌కు ఎదుర‌వుతున్న ప్ర‌ధాన ప్ర‌శ్న‌లు రెండు. ఒక‌టి.. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై మీ అభిప్రాయం ఏంటి? కేంద్రంలోని బీజేపీ ప్రైవేటీక‌రించ‌కుండా.. ఉండేందుకు మీరేం చేస్తున్నారు? అని ఇక్క‌డి ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. కేవ‌లం ప్ర‌జ‌లే కాదు.. మిత్రులు, స్నేహితులు కూడా రాజును ఇబ్బంది పెడుతున్నారు. ఇక‌, మ‌రో కీల‌క ప్ర‌శ్న‌.. విశాఖ రాజ‌ధానిపై.. మీరు ఏమంటారు? ఈ రెండు అంశాల‌పైనా.. రాజుగారు.. ఏమీ చెప్ప‌లేక‌.. స‌త‌మ‌తం అవుతున్నారు. మ‌రోవైపు.. పార్టీలోనూ.. ఆయ‌న‌కు స‌హ‌కారం కొర‌వ‌డింది. అయిన‌ప్ప‌టికీ.. ఒంట‌రి పోరు మాత్రం ఆప‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి వ‌చ్చే ఎన్నిక‌లపై ఈయ‌న పెట్టుకున్న ఆశ‌లు ఏమేర‌కు నెర‌వేరుతాయో చూడాలి.