Begin typing your search above and press return to search.
ప్రచారాన్ని పక్కనపెట్టేసిన తమ్ముల్లు
By: Tupaki Desk | 23 Nov 2016 8:30 PM GMTజాతీయ పార్టీగా ఎదిగి సత్తా చాటుకోవాలని భావిస్తున్న తెలుగుదేశం పార్టీకి కీలకమైన నిర్మాణ దశలో ఊహించని చిక్కులు ఎదురయ్యాయని పార్టీ నేతలు అంతర్గత సంభాషణల్లో చెప్తున్నారు. రాజకీయ పార్టీకి ప్రాణాధారమైన ప్రచారం చేసే క్రమంలో వచ్చిన పెద్ద నోట్ల రద్దు ప్రజలందరినీ తమ వ్యక్తిగత పనుల్లో బిజీబిజీ చేయడం వల్ల కలిగిన నిరూత్సాహభరిత నిర్ణయమే ఇందుకు నిదర్శనమని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జన చైతన్య యాత్రల్లో పార్టీ నేతలకు ఈ పరిస్థితి ఎదురైంది. ఈనెల ఒకటో తేదీన యాత్రలు ప్రారంభం అయి మొదట్లో అన్ని నియోజకవర్గాల్లో నేతల పర్యటనలు ఉత్సాహంగా సాగాయి. అయితే ఈనెల 8న ప్రధానమంత్రి పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించడంతో అంతటా కలకలం చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ ఎఫెక్ట్ టీడీపీపై కూడా బాగానే పడిందంటున్నారు. ఏకంగా పార్టీ పనిని పక్కనపెట్టి సొంత పనులు చూసుకునే స్థాయికి చేరిందని టాక్.
ప్రధానమంత్రి నిర్ణయం అనంతరం బ్యాంకుల పనిదినాలు ప్రారంభమైన 10వ తేదీ నుంచి అంతా బ్యాంకుల ఎదుట క్యూ కట్టడం ప్రారంభించారు. 11 నుంచి ఏటీఎంల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎవరికి వారు తమ డబ్బు భద్రంగా బ్యాంకులో వేసుకోవడం, ఖాతాలో ఉన్న డబ్బును ఎటిఎంల నుంచి డ్రా చేసుకునేందుకు 12 రోజు రోజులుగా అష్టకష్టాలు పడుతున్నారు. 10వ తేదీ నుంచి ప్రజల దృష్టి అంతా పాతనోట్ల మార్పిడి - కొత్త నోట్లు లేక చిన్న నోట్లు తీసుకునే ప్రయత్నాల్లోనే ఉన్న నేపథ్యంలో ప్రజలు జనచైతన్య యాత్రలను పట్టించుకునే స్థితిలో లేరని టీడీపీ నాయకులకు కలత చెందుతున్నారు. అదే సమయంలో టీడీపీ నాయకులే తమ వద్ద ఉన్న పాతనోట్లను ఎలా మార్చుకోవాలా అని సతమతం అయ్యారు. దీంతో వారు కూడా పూర్తి స్థాయిలో జనచైతన్య యాత్రలపై దృష్టి సారించలేదు. టీడీపీ నేతల్లో సగానికి పైగా వ్యాపారస్తులే ఉన్నారు. రూ.500 - వెయ్యి రద్దు వల్ల ఒక వైపు వ్యాపారాలు గందరగోళంలో పడటం - మరో వైపు తమ వద్ద లిక్విడ్ క్యాష్ ను ఎలా మార్చుకోవాలో తెలియక చాలా మంది తీవ్ర అయోమయంలో పడ్డారు. కనీసం రూ.3 లక్షల నుంచి కోటి వరకూ వ్యక్తిగతంగా ఇళ్లలో - వ్యాపార సంస్థలో - రహస్య స్థావరాల్లో నిల్వ బెటుకున్న వారు వాటిని మార్చుకునేందుకు పలు ఎత్తుగడలు అవలంభించడంలో బిజీ అయిపోయారు. తద్వారా సభ్యత్వ నమోదు అటకెక్కినంత పనయింది.
మరోవైపు మొదట్లో నల్లధనం వెలికితీత మంచిదేనంటూ ప్రకటనలు ఇచ్చిన తెలుగుదేశం నేతలు తర్వాత ట్యూన్ మార్చారు. ముందస్తు ప్రణాళిక లేకుండా ప్రజల ఇబ్బందులను పరిగణలోకి తీసుకోకుండా నేరుగా పెద్ద నోట్లను రద్దు చేయడం తప్పేనని ఎక్కువ మంది ప్రజలు బ్యాంకులు - ఎటిఎంల వద్ద అసహనం వ్యక్తం చేయడంతో టీడీపీ నేతల్లో కూడా కొంత కంగారు ప్రారంభం అయింది. ప్రజలకు క్రమంగా పెరుగుతున్న కరెన్సీ కష్టాలతో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం ప్రారంభించారు. అదే సమయంలో సభ్యత్వ నమోదుకు కూడా చిన్న నోట్ల కొరత ఏర్పడింది. దీంతో గతంలో కన్నా ఘనంగా జన చైతన్య యాత్రలు నిర్వహించి చేసిన అభివృద్ధి - చేయాల్సిన పనులను ప్రజలకు వివరించాలి అనుకున్నది కాస్త ఆశించిన స్థాయికి చేరలేకపోయింది. ప్రజలు ప్రచారాలను పట్టించుకునే స్థితిలో లేకపోవడంతో జనచైతన్య యాత్రను లైట్ తీసుకున్నట్లు సమాచారం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/