Begin typing your search above and press return to search.
దేవుళ్లకు తప్పని నోట్ల సెగ
By: Tupaki Desk | 10 Nov 2016 12:02 PM GMTపెద్దనోట్ల రద్దు...ఇపుడు ఎక్కడ చూసినా ఇదే టాపిక్. సామాన్యుడు మొదలు కొని సర్కారు వరకు తమ ఆర్థిక ఆలోచనలను మార్చుకోవాల్సిన పరిస్థితి. అయితే ఈ పరిస్థితి ఇపుడు సర్వాంతర్యామి అయిన దేవుళ్లను కూడా వదలడం లేదు. రద్దుచేసిన నోట్లను వదిలించుకోవడం.. పనిలోపనిగా ఎప్పుడో దేవుడికి మొక్కిన మొక్కులు చెల్లించుకోవడం! వెరసి.. ఇప్పుడు దేవుళ్ల హుండీలన్నీ రూ.500 - రూ.1000 నోట్లతో నిండిపోతున్నాయి. తిరుపతి వెంకన్న - శ్రీశైలం మల్లన్న - యాదగిరిగుట్ట - భద్రాచలం - వేములవాడ - కొండగట్టు ఆంజనేయస్వామి - బాసర సరస్వతీ క్షేత్రం - కొమురవెల్లి మల్లన్న - వరంగల్ భద్రకాళి - సికింద్రాబాద్ గణపతి దేవాలయాల వద్ద భక్తులు హుండీల దగ్గర క్యూలలో నిలిచి పెద్ద నోట్లతో హుండీలు నింపుతున్నారు. అయితే అవన్నీ రూ.500 - రూ.1000 నోట్లే కావడం విశేషం.
ఈ పరిణామంపై దేవాదాయ శాఖ వర్గాలు ఆసక్తిగా స్పందిస్తున్నాయి. దేవాలయాలన్నింటిలో నెలాఖరులోనే హుండీల లెక్కింపు జరుగుతుందని - అందుకని రూ.500లు - రూ.1000 నోట్లకట్టలు ఎన్ని పడ్డాయో ఇప్పుడే చెప్పడం కష్టమని ఆలయాల పరిపాలనాధికారులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా పెద్ద సంఖ్యలో జనం నోట్ల కట్టలు కుప్పలుగా వేస్తుండటాన్ని చాటునుండి గమనిస్తున్న ఆలయాల ఉద్యోగులు దేవుడి ఆదాయం పెరుగుతున్నందుకు సంతోషం పట్టలేకపోతున్నారు. ప్రముఖ దేవాలయాలన్నింటీలో ఆర్జిత సేవల ఆదాయం లక్షవరకు పెరిగినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/