Begin typing your search above and press return to search.
పెద్ద నోట్ల రద్దు 7నెలల ముందే వారికి తెలిసిందా?
By: Tupaki Desk | 11 Nov 2016 5:30 PM GMTరూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయం కాదని, సుమారు ఆరునెలలుగా మోడీ ఈ విషయంపై లీకులేమీ బయటకు రాకుండా అతితక్కువమందితో జాగ్రత్తగా డీల్ చేశారని కథనాలొస్తున్నాయి. దీంతో నల్లధనం నిర్మూలించేందుకు తీసుకున్న నిర్ణయంగా మోడీ సర్కారును కొంతమంది మెచ్చుకుంటున్నారు. ఈ నోట్ల రద్దు విషయం మోడీ ప్రకటించేవరకూ కేంద్ర మంత్రులకుగానీ, మోడీ సన్నిహితులకుగానీ ఎవరికీ తెలియకుండా చాలా రహస్యంగా వ్యవహరించారని అభినందిస్తున్నారు. అయితే, తాజాగా ఒక విషయం పేపర్ కటింగులతో సహా ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తుంది.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది!
మోడీ త్వరలోనే పెద్దనోట్లను రద్దుచేయబోతున్నారని, ఆ విషయం గుజరాత్ లో చాలామందికి తెలుసునన్ని ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తున్న పేపర్ కటింగుల సారాంశం. అక్కడి స్థానిక వార్తా పత్రికల్లో రూ. 500, రూ. 1000 నోట్లు రద్దు అవుతాయని ఎప్పుడో కథనాలు వచ్చేశాయట. అంతేకాదు, పెద్ద నోట్లను ఎలా మార్చుకోవాలో చెప్పే సూచనలు కూడా కొన్ని నెలల కిందటే ఆ పత్రికలవారు ఎలా ఊహించారన్నది ఇప్పుడు భారీ ప్రశ్నగా సంచరిస్తుంది! ఇదే క్రమంలో మరింత ఆశ్చర్యానికి గురిచేస్తూ... రూ. 2000 వేల నోట్లు కూడా రాబోతున్నట్టు ఊహాగానాలు కూడా ఆ కథనంలో ఉందట!
దీంతో మోడీ పెద్ద నోట్ల రద్దు విషయం ముందుగానే గుజరాతీలకు తెలిసిందనీ, ఆ తరువాత బడా పారిశ్రామికవేత్తలకూ కిందిస్థాయి నాయకులకు కూడా సమాచారం అందే ఉంటుందంటూ ఈ కథనం ఆధారంగా కొంతమంది ఆరోపిస్తున్నారు. ఢిల్లీలో ప్రధానమంత్రి సమక్షంలో అత్యంత రహస్యంగా తీసుకున్న నిర్ణయం... ఒక స్థానిక పత్రికా విలేకరికే తెలిసిందంటే... బడా బడా దిగ్గజాలకూ, నాయకులకూ ఇంతకంటే ముందే తెలిసి ఉండదా? అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.
దీంతో... ఈ పేపర్ కటింగులు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అందరూ అన్నీ సర్దుకున్నాకనే, ముఖ్యంగా మోడీ అండ్ కో జాగ్రత్త పడిన తర్వాతే నోట్లను రద్దు చేశారనీ, ఈ నిర్ణయంతో నల్లధనవంతులు క్షేమంగానే ఉన్నారనీ, సామాన్యులే నానా అవస్థలు పడుతున్నారని పలు కామెంట్లు కనిపిస్తున్నాయి. అయితే... ఈ పేపర్ కటింగులపై ఇంతవరకూ ఏ బీజేపీ నేతా అధికారికంగా స్పందించినట్లు లేదు!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/