Begin typing your search above and press return to search.
రద్దు తర్వాతా గాలి ఇంట పెళ్లి అంతఘనంగా?
By: Tupaki Desk | 15 Nov 2016 8:01 AM GMTఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్న ఫంక్షన్ చేయాలంటే కిందా మీదా పడిపోయే పరిస్థితి. నోట్ల రద్దుతో దేశ ప్రజలకు ఎక్కడ లేని కష్టాలు వచ్చి పడ్డాయ్. బ్యాంకు అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉన్నా.. వారానికి కేవలం రూ.24 వేలు మాత్రమే ఇవ్వటం లాంటి నిర్ణయాలు దేశ ప్రజలకు చిరాకు పుట్టించేస్తున్నాయ్. ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేయాలని ప్లాన్ చేసుకున్న వారికి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇక.. ఇప్పటికే ఫంక్షన్ పూర్తి చేసి.. పేమెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే దేముడికే ఎరుక అన్నట్లుగా మారింది.
ఇలాంటి వేళ.. దాదాపు రూ.500 కోట్ల ఖర్చుతో జరుగుతున్న పెళ్లిగా చెబుతున్న మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డి ఇంట పెళ్లి మరింత గ్రాండ్ గా ఎలా జరుగుతుంది? ఆయనకు నోట్ల కష్టాలు రాలేదా? అన్న సందేహాలు అందరికి వస్తున్న పరిస్థితి. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో గాలి వారింట జరగాల్సిన పెళ్లిని వాయిదా వేస్తారని అందరూ భావించారు. కానీ.. అందుకు భిన్నంగా పెళ్లిని ముందుగా అనుకున్నట్లే రేపు (నవంబరు 16న) జరిపేందుకు రెఢీ అయ్యారు.
ఈ పెళ్లికి రాజకీయ నేతలు.. సినిమా స్టార్లు.. పారిశ్రామికవేత్తలతో సహా భారీగా పెద్దలు రానున్నట్లు చెబుతున్నారు. వారికి ఎలాంటి అసౌకర్యం జరగకుండా ఏర్పాట్లు భారీగా చేసినట్లుగా చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లోభారీ ఖర్చతో వేడుకలు చేయటం సాధ్యం కాకున్నా.. వందల కోట్ల ఖర్చుతో గాలి వారు పెళ్లి వేడుకల్ని ఎలా చేస్తున్నారన్న ప్రశ్నలకు విశ్వసనీయ వర్గాలు ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాయి.
పెళ్లికి సంబంధించిన అన్నీ వ్యవహారాల్ని ముందుగానే ఒక ఈవెంట్ సంస్థకు అప్పగించారట. ఆరు నెలల క్రితమే దీనికి సంబంధించిన చెల్లింపులు ముందస్తుగా జరిగాయని చెబుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో మొదట పెళ్లిని వాయిదా వేయాలని అనుకున్నా.. కష్టమో.. నష్టమో తాము ఆ కార్యక్రమాన్ని ముందుగా అనుకున్నట్లు పూర్తి చేస్తామన్న భరోసాను సదరు సంస్థ ఇచ్చిందని చెబుతున్నారు. గొప్పింటి పెళ్లిని ఇన్ని ఇబ్బందుల్లోనూ గ్రాండ్ గా పూర్తి చేస్తే.. ఆ మైలేజీ అంతా ఆ సంస్థదే కదా? అందుకే.. నోట్ల రద్దు కష్టాలు ఎన్ని ఉన్నా.. గాలి వారింట మాత్రం పెళ్ మా గొప్ప వేడుకగా జరిపేందుకు ఏర్పాట్లు జోరుగా సాగిపోతున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/