Begin typing your search above and press return to search.
తమిళుల నెత్తిన మరో వాయుగండం
By: Tupaki Desk | 5 Dec 2017 4:20 AM GMTవరుణుడి శాపంతో తమిళులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా? ఒకటి తర్వాత మరొకటిగా మీద పడుతున్న వరుణ గండాలకు తమిళులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆ మధ్యన కురిసిన భారీ వర్షాలు తమిళనాడుకు చేయాల్సినంత నష్టాన్ని చేశాయి. అందులో నుంచి ఆ మధ్యన కోలుకుంటున్న వారిపై ఓఖి పేరిట మరో పిడుగు పడింది.
ఓఖి దెబ్బకు తమిళనాడులోని దక్షిణాది జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. ఓఖి కారణంగా దెబ్బ తిన్న కన్యాకుమారి.. తిరునెల్వేలి.. తూత్తుకూడి తదితర జిల్లాలు ఇంకా కోలుకోలేదు. ఇప్పటికి పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. ఓఖి కారణంగా వీచిన పెనుగాలులతో విరిగిపడిన కరెంటు స్తంభాల పునరుద్ధరణ ఇంకా పూర్తి కాలేదు. రోజులు గడుస్తున్నా.. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను ఇంకా పునరుద్ధరించలేదు.
విద్యుత్ సరఫరా లేకపోవటంతో నీటి సమస్యను పెద్ద ఎత్తున ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమిళులకు ఆశనిపాతంలా మరో వార్త తెర మీదకు వచ్చింది. మరో వాయుగండం తమిళుల్ని పరీక్షించేందుకు రానుందని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు.
ఆగ్నేయ బంగాళాఖాతంలో అండమాన్ సమీపాన ఏర్పడిన అప్పపీడనం ఉపరితల ఆవర్తనంగా మారి.. దక్షిణ అండమాన్ సముద్రం.. దాని పరిసరాల్లో ఉత్తర సమత్ర దీవి వరకు కేంద్రీకృతమైంది. ఇది వాయుగుండంగా మారి తమిళనాడు.. దక్షిణ ఆంధ్ర కోస్తా జిల్లాలవైపు కదలనుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు మొదలు పెద్ద ఎత్తున గాలులు.. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. వాయు గుండం సమీపించే కొద్దీ భారీ వర్షాలు కాస్తా అతి భారీ వర్షాలు కురవనున్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఈ వాయుగుండం చెన్నైను సమీపించి అనంతరం ఆంధ్ర.. ఒడిశాల వైపు కదిలే అవకాశాలు ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. ఓఖి చేసిన నష్టం నుంచి కోలుకోలేని తమిళులకు.. తాజా వాయిగుండం పెద్ద పరీక్షగా మారుతుందనటంలో సందేహం లేదు. మరి.. ఈ వాయుగుండం ఎన్ని తిప్పలు తేనుందో?