Begin typing your search above and press return to search.
వైసీపీ ఎమ్మెల్యేకు షాక్.. కేసుల ఉపసంహరణ కుదరదు: హైకోర్టు
By: Tupaki Desk | 22 Jun 2022 12:30 PM GMTప్రజాప్రతినిధుల కేసుల ఉపసంహరణపై ఏపీ హైకోర్టు సీరియస్ అయింది. ఈ కేసులను ఏయే ఆధారాలతో తప్పిస్తున్నారని.. ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తాజాగా ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట నియోజవర్గం వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభానుపై కేసులు ఉపసంహరించుకోవడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ఏపీజేఎఫ్ అధ్యక్షుడు చెవులు కృష్ణాంజనేయులు దాఖలు చేసిన పిటీషన్ పై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
కేసులు ఉపసంహరించుకునేందుకు అనుసరిస్తున్న మార్గం ఏంటని.. ప్రభుత్వాన్ని నిలదీసింది. విచారణ సందర్భంగా పిటీషన్ పై వాదనలు వినిపించిన న్యాయవాది జడ శ్రవణ్ కుమార్.. పీపీతో సంబంధం లేకుండా డీజీపీ, కలెక్టర్ ఆదేశాలతో కేసులు తొలగిస్తున్నారని కోర్టుకు వివరించారు.
వీటిని అలా తొలగించడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కేసులు తొలగించాలంటే హైకోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉందని కోర్టుకు తెలిపారు.
ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న హైకోర్టు ధర్మాసనం.. హైకోర్టు అనుమతి లేకుండా కేసులు ఎలా తొలగించారని ప్రశ్నించింది. ఇది కోర్టు ధిక్కారం కిందకు వస్తుందన్న విషయాన్ని మరిచిపోయారా? అని ప్రబుత్వం తరఫున న్యాయవాదిని ప్రశ్నించింది. ఇప్పటివరకు ఎన్ని కేసుల తొలగింపునకు హైకోర్టు అనుమతి తీసుకున్నారో తమకు చెప్పాలని ఆదేశించింది.
అంతేకాదు.. ఎన్ని ఉపసంహరించారన్నదానిపై అఫిడవిట్ వేయాలని ధర్మాసనం ఆదేశించింది. ఓటర్లకు డబ్బుల పంపిణీ, అధికారులపై దాడుల కేసులు కూడా తొలగించారని ధర్మాసనం దృష్టికి శ్రవణ్ కుమార్ తీసుకువచ్చారు. దీంతో స్పందించిన ధర్మాసనం.. ప్రభుత్వం అఫిడవిట్ వేయకుంటే కేసులో ధిక్కరణ ఆదేశాలు ఇస్తామని స్పష్టం చేసింది.