Begin typing your search above and press return to search.
ఎమ్మెల్యేల కొనుగోళ్లు: నిందితులకు రిమాండ్.. హైకోర్టు సంచలన తీర్పు..
By: Tupaki Desk | 29 Oct 2022 7:30 AM GMTమునుగోడు ఉప ఎన్నికల వేళ తెలంగాణలో సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సైబరాబాద్ పోలీసులు దాఖలు చేసిన పిటీషన్ ను హైకోర్టు స్వీకరించి ముగ్గురు నిందితులకు షాక్ ఇచ్చింది. ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్ తీర్పును రద్దు చేసి వారిని రిమాండ్ కు హైకోర్టు పోలీసులకు అనుమతించింది. నిందితులు వెంటనే సైబరాబాద్ కమిషనర్ ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. లేకపోతే అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరచాలని కోరింది. ఆ తర్వాత రిమాండ్ కు తరలించాలని పోలీసులకు ఆదేశించింది.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పట్టుకున్న ముగ్గురు నిందితులకు రిమాండ్ విధించేందుకు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి నిరాకరించిన సంగతి తెలిసిందే. వారికి వెంటనే బెయిల్ ఇవ్వాలని ఏసీబీ కోర్టు నిన్న ఆదేశించింది. దీంతో ఈ కేసులో పోలీసులకు చుక్కెదురైంది.
ఈ పరిణామంతో షాక్ అయిన టీఆర్ఎస్ సర్కార్ హైకోర్టుకు ఎక్కింది. సైబరాబాద్ పోలీసులు పక్కా ఆధారాలు, ఎఫ్ఐఆర్ తో హైకోర్టును ఆశ్రయించారు. పోలీసుల పిటీషన్ పై శుక్రవారం విచారణ జరిపిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
ముగ్గురు నిందితులు హైదరాబాద్ విడిచి వెళ్లొద్దని షరతు విధించింది. నిందితులు తమ నివాస చిరునామాలను సైబరాబాద్ పోలీసులు కమిషనర్ కు అందజేయాలని సూచించింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన రోహిత్ రెడ్డిని సంప్రదించడం కానీ.. సాక్ష్యులను ప్రభావితం చేయడానికి గానీ వారు ప్రయత్నించరాదని షరతు విధించింది.
ఈ పసిటీషన్ పై విచారణను ఇవాళ్టికి వాయిదా వేసిన హైకోర్టు.. సైబరాబాద్ పోలీసుల వాదనలతో ఏకీభవిస్తూ రిమాండ్ ను తిరస్కరిస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది.
ఏసీబీ కోర్టు తీర్పుతో నిన్న సంబరాలు చేసుకున్న బీజేపీ నేతలు ఇప్పుడు సైలెంట్ అయిన పరిస్థితి నెలకొంది. ఇక ఏసీబీ కోర్టులో నిందితులకు బెయిల్ రావడాన్ని సీరియస్ గా తీసుకున్న తెలంగాణ సర్కార్ హైకోర్టుకు ఎక్కి విజయం సాధించింది. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య సాగుతున్న ఈ వార్ లో తాజాగా టీఆర్ఎస్ దే పైచేయిగా నిలిచింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.