Begin typing your search above and press return to search.
బోడె ప్రసాద్ కు హైకోర్టులో చుక్కెదురు!
By: Tupaki Desk | 18 Sept 2018 6:16 PM ISTగత నాలుగేళ్ల టీడీపీ పాలనలో ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని ప్రజలు అభిప్రాయపడుతోన్న సంగతి తెలిసిందే. ఎమ్మార్వో వనజాక్షి పై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రసాద్ చేయి చేసుకోవడం మొదలు....వైసీపీ ఎమ్మెల్యే రోజాపై టీడీపీ ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేయడం వరకు....మహిళలను అవమానించిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఇదే క్రమంలో రోజాపై టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్...గతంలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. తన నియోజవర్గానికి రోజా వస్తే తీవ్రంగా అవమానిస్తామని అర్థం వచ్చేలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. సాటి ఎమ్మెల్యే...అందునా మహిళ అని కూడా చూడకుండా ఆమెను దూషించారు. అయితే, అప్పట్లో బోడె ప్రసాద్ పై రోజా ఫిర్యాదును కృష్ణా జిల్లా పెనమలూరు పోలీసులు స్వీకరించలేదు. దీంతో, ఆమె హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో తాజాగా, ఆ పిటిషన్ ను విచారణ జరిపిన హైకోర్టు....రోజాకు అనుకూలంగా స్పందించింది. బోడె ప్రసాద్ పై కేసు నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్ పోలీసులకు హైకోర్టు మంగళవారం నాడు ఆదేశాలు జారీ చేసింది.
కాల్ మనీ వ్యవహారంలో బోడె ప్రసాద్ పేరుందని రోజా ఆరోపించారు. దీంతో, రోజాపై కక్ష పెంచుకున్న ప్రసాద్....ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. రోజా తమ నియోజకవర్గానికి వస్తే చెప్పులు - గుడ్లు పడతాయని...పరుషపదజాలంతో దూషించారు. తనపై ఆమె చేసిన ఆరోపణలకు బదులుగా ఆమెపై తీవ్ర వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని అంగీరరించారు. దీంతో,బోడె ప్రసాద్ పై కేసు నమోదు చేసేందుకు రోజా పెనమలూరు పోలీసులను ఆశ్రయించారు. అయితే, వారు కేసు నమోదు చేయలేదు. దీంతో, ఆమె ఆగస్టులో హైకోర్టును ఆశ్రయించారు. ప్రసాద్ పై కేసు నమోదు చేయకపోవడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి, విజయవాడ పోలీస్ కమిషనర్, పెనమలూరు ఎస్ఎహెచ్ఓలను ప్రతివాదులుగా చేర్చారు. దీంతో, రోజా పిటిషన్‌పై నేడు విచారణ చేపట్టిన న్యాయస్థానం బోడె ప్రసాద్‌పై కేసు నమోదు చేయాల్సిందిగా ఏపీ పోలీసులను ఆదేశించింది.