Begin typing your search above and press return to search.

విశాఖలో గ్యాస్ లీక్ ..సుమోటోగా తీసుకొన్న హైకోర్టు .. ప్రభుత్వాలకి నోటీసులు

By:  Tupaki Desk   |   7 May 2020 11:50 AM GMT
విశాఖలో గ్యాస్ లీక్ ..సుమోటోగా తీసుకొన్న హైకోర్టు .. ప్రభుత్వాలకి నోటీసులు
X
నిన్నటి వరకు చాలా ప్రశాంతంగా ఉన్న వైజాగ్ ఒక్కసారిగా ఇప్పుడు అల్లకల్లోలంగా మారింది. గోపాలపట్నం పరిధిలోని ఆర్‌ ఆర్‌ వెంకటాపురంలో ఉన్న ఎల్‌ జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి కెమికల్ గ్యాస్ లీకైంది. చుట్టుపక్కల 5కి.మీ వరకు ఈ గ్యాస్ వ్యాపించడంతో 1000 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురైనట్టు సమాచారం. ఇప్పటివరకు 8 మంది మృతి చెందినట్టు ప్రభుత్వం అధికారికంగా తెలుస్తోంది. గ్యాస్ లీక్ సమాచారంతో కొంతమంది ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీయగా.. గ్యాస్ ప్రభావానికి రోడ్డుపైనే కుప్పకూలిపోయారు.

కాగా, విశాఖ గ్యాస్ లీక్ ఘటనను సుమోటోగా హైకోర్టు స్వీకరించింది. ప్రమాదంపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు. ఈ విషయమై విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది హైకోర్టు. విచారణ ప్రారంభమయ్యే సమయానికి అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. ఇకపోతే గ్యాస్ లీకేజి భాదితులకు మెరుగైన వైద్యం అందుతుంది అని , అందరూ కోలుకుంటున్నారని వైద్యులు చెప్తున్నారు.

కాగా, గ్యాస్ లీకేజ్ ఘటనలో బాధితులను ఏపీ సీఎం జగన్ పరామర్శించారు. కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి ఈ ఘటనకు సంబంధించిన వివరాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. వారి ఆరోగ్యపరిస్థితిపై ఆరా తీశారు. వైద్య సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయని అడిగారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.