Begin typing your search above and press return to search.
ఆసక్తికర పరిణామం.. ఏపీ ప్రభుత్వాన్ని ఆ ప్రశ్న అడిగిన హైకోర్టు
By: Tupaki Desk | 30 Aug 2022 4:11 AM GMTనవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద రాజధాని ప్రాంతంలో ఇళ్ల పట్టాల పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం 2020 ఫిబ్రవరి 25న జారీ చేసిన జీవో నంబర్ 107ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఏపీ రాజధాని అమరావతి అని ప్రభుత్వం ఒప్పుకుంటే మీరు కోరిన విధంగానే విచారణ చేస్తామని ప్రభుత్వానికి తెలిపింది. అయితే రాజధాని నిర్మాణం తన పరిధిలోది కాదని అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పారు. దీంతో హైకోర్టు ధర్మాసనం విచారణను అక్టోబర్ 21కి వాయిదా వేసింది.
కాగా ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. రాజధాని అమరావతి ప్రాంతంలో పేదలందరికీ ఇళ్లు పథకం కింద 50 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే రాజధానికి ఇచ్చిన భూముల్లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని అనుకోవడం రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) చట్ట నిబంధనలకు విరుద్ధమంటూ.. 107 జీవోను సవాల్ చేస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో ఈ జీవోపై ఇప్పటికే హైకోర్టు మధ్యంతర స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు రాజధాని రైతులు సుప్రీంకోర్టులో రాజధాని వ్యవహారంపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు.
తాజాగా ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ప్రభుత్వం జారీ చేసిన జీవో 107 సవాల్ చేస్తూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా పిటిషనర్ల తరపు న్యాయవాది ఇంద్రనీల్‌బాబు వాదనలు వినిపించేందుకు సిద్ధం అవుతుండగా ధర్మాసనం జోక్యం చేసుకుంటూ... రాజధానిపై కొందరు రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించినందున విచారణను అక్టోబర్ 21కి వాయిదా వేస్తున్నట్టు తెలిపింది.
ఈ సందర్భంలో జగన్ ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల వల్ల 50 వేల మందికి ఇళ్ల పట్టాల మంజూరు ఆగిపోయిందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. కాబట్టి విచారణను రెండు వారాలకు వాయిదా వేయాలని అభ్యర్థించారు.
ఈ సందర్భంగా త్రిసభ్య ధర్మాసనం ప్రభుత్వానికి కీలక ప్రశ్న సంధించింది. రాజధానిని అమరావతిలోనే నిర్మిస్తున్నారా? అని ఏఏజీని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి మీరు ఔనని సమాధానం ఇస్తే మీరు కోరిన విధంగానే విచారణ చేపడతామని స్పష్టం చేసింది. దీంతో ఆయన రాజధాని వ్యవహారం తన పరిధిలోనిది కాదంటూ నిస్సహాయత వ్యక్తం చేశారు. రాజధానిని మార్చే హక్కు ఏపీ శాసనసభకు లేదని గతంలో హైకోర్టు తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజధానిని అమరావతిలోనే నిర్మిస్తే విచారణను వెంటనే చేపడతామని చెప్పడం విశేషం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.