Begin typing your search above and press return to search.

బ్రాండ్స్ గోల్‌ మాల్.. స్టార్ల‌కు బిగ్ చెక్!?

By:  Tupaki Desk   |   17 Feb 2019 8:39 AM GMT
బ్రాండ్స్ గోల్‌ మాల్.. స్టార్ల‌కు బిగ్ చెక్!?
X
బ్రాండ్ ప్ర‌మోష‌న్స్ లో సినిమా, క్రికెట్ దిగ్గ‌జాల‌దే హ‌వా అన‌డంలో సందేహం లేదు. అయితే ఇటీవ‌ల సీన్ మారింది. వీళ్ల‌కు ధీటుగా ఇత‌ర క్రీడా రంగాల్లోని ఆట‌గాళ్లు స్పీడెక్కుతున్నార‌ని తాజా స‌న్నివేశం చెబుతోంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కి పోటీగా బ్యాడ్మింట‌న్ స్టార్, ఒలింపిక్ ర‌జ‌త‌ప‌త‌క విజేత‌ పీవీ సింధు కుదుర్చుకున్న ఓ డీల్ ప్ర‌పంచాన్ని ఆ స్థాయిలో విస్మ‌యానికి గురి చేసింది. పీవీ సింధు మాత్ర‌మే కాదు క్రీడాకారుల్లో సైనా నెహ్వాల్, శ్రీ‌కాంత్, హిమ‌దాస్ వంటి క్రీడాకారులు భారీ డీల్స్ కుదుర్చుకోవ‌డం ఆస‌క్తిక‌రం.

కింగ్ ఖాన్ షారూక్, అమీర్ ఖాన్, స‌ల్మాన్ భాయ్ వంటి వాళ్లు వంద‌ల కోట్ల డీల్స్ కుదుర్చుకున్న సంద‌ర్భాలున్నాయి. విరాట్ కోహ్లీ, స‌చిన్, ఎం.ఎస్.ధోని వంటి టీమిండియా కెప్టెన్ల రేంజు వంద‌ల కోట్లు. వీళ్ల‌కు ధీటుగా న‌వ‌త‌రం ఆట‌గాళ్లు బ్రాండ్ ప్ర‌మోష‌న్స్ లో దూసుకుపోతున్నారు. భారీ కాంట్రాక్టుల్ని కుదుర్చుకుంటున్నారు. ఓ అధికారిక స‌మాచారం ప్ర‌కారం.. ఏడాదికి డీల్స్ రూపంలోనే విరాట్ కోహ్లీ దాదాపు రూ. 228 కోట్లు సంపాదిస్తున్నాడు. ప్ర‌ఖ్యాత‌ టిస్సాట్‌, ప్యూమా, హీరో మోటోకార్ప్స్‌ మిస్టర్‌ ఔల్‌, సన్‌ఫార్మా ఓలిని, రెమిట్‌ టు ఇండియా, ఫిలిప్స్‌, లూమినస్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, ఉబెర్‌ ఇండియా, అమేజ్‌ ఇన్వర్టర్‌, లక్స్ వంటి బ్రాండ్లకు అత‌డు ప్ర‌మోష‌న్ చేస్తున్నాడు. క్రికెట్ గాడ్ స‌చిన్ టెండూల్క‌ర్ రిటైర్ మెంట్ త‌ర్వాత ఓ రేంజులో ఆర్జిస్తున్నారు. ఏడాదికి మినిమంగా రూ.80కోట్ల ఆదాయం బ్రాండ్ ప్ర‌మోష‌న్ రూపంలో ఉంద‌ని అంచ‌నా పెప్సీ, బూస్ట్‌, ఆడిడాస్‌, అపోలో టైర్స్‌, బీఎండబ్ల్యూ, లూమినస్‌ పవర్‌, ట్రూ బ్లూ, నేషనల్‌ ఎగ్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ (ఎన్‌ఈసీసీ)... వంటి వాటికి ప్ర‌మోట‌ర్ గా స‌చిన్ ఉన్నారు. 101 కోట్ల ఒప్పందాల‌తో ఎంఎస్‌ ధోనీ సంచ‌ల‌నం సృష్టిస్తున్నారు. మాస్టర్‌కార్డ్‌, వార్డ్‌విజ్‌, రన్‌ ఆడమ్‌, సౌండ్‌ లాజిక్‌, సుమఽధురా గ్రూప్‌, ఇండిగో పెయింట్స్‌, స్టికర్స్‌ చాకొలేట్‌, డ్రీమ్‌ 11, నెట్‌మెడ్స్‌, ఎస్‌ఆర్‌ఎంబీ స్టీల్‌, ఆఫీసర్‌ చాయిస్‌ బ్లూ, భారత్‌ మాట్రిమోనియల్‌, పనెరీ, గో డె, ఇండీ ప్లాట్‌ఫామ్ వంటి బ్రాండ్లు అత‌డి ఖాతాలో ఉన్నాయి.

న‌వ‌త‌రంలో రూ. 28.5 కోట్ల మేర డీల్స్ తో హార్దిక్‌ పాండ్యా ది బెస్ట్ అనిపిస్తున్నాడు. గల్ఫ్‌ ఆయిల్‌, జిల్లెట్‌, జగాల్‌, సిన్‌ డెనిమ్‌, ఈయూఎంఈ, బోట్‌, డీఎఫ్‌వై వంటి ప్ర‌ముఖ బ్రాండ్ల‌కు అత‌డు ప్ర‌చార‌క‌ర్త‌. బ్యాడ్మింట‌న్ స్టార్ సైనా నెహ్వాల్‌ ఏడాదికి రూ. 16.5 కోట్లు పైగా ఆర్జిస్తున్నార‌ట‌. రస్నా, డూ ఇట్‌ టాలెంట్‌ వెంచర్‌, కెల్లాగ్‌, అయోడెక్స్‌, ఫార్చ్యూన్‌ ఆయిల్‌, టాప్‌ రామన్‌, ఎన్‌ఈసీసీ వంటి బ్రాండ్ల‌కు సంత‌కం చేశారు. ఏడాదికి 58 కోట్ల ట‌ర్నోవ‌ర్ తో పీవీ సింధు ఆర్జ‌న ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కొచ్చింది. వోడాఫోన్‌, సఖి, జేబీఎల్‌, స్టేఫ్రీ, లీ నింగ్ వంటి ప్ర‌ఖ్యాత బ్రాండ్ల‌కు సింధు ప్ర‌చారం చేస్తున్నారు. విరాట్ తో స‌మానంగా ఇటీవ‌లే పీవీ సింధు చైనీ కంపెనీ లీనింగ్ తో రూ.50 కోట్ల ఒప్పందం చేసుకుని సంచ‌ల‌నం సృష్టించింది సింధు. ఏడాదికి 10 కోట్ల ఆర్జ‌న‌తో అథ్లెట్ (ర‌న్న‌ర్) హిమాదాస్ త‌న స్థాయిని పెంచుకునే ప‌నిలో ఉన్నారు. ఆడిడాస్‌, ఎడెల్‌వీస్‌, ఎస్‌బీఐ డిజిటల్‌ బ్యాంకింగ్‌, యునిసెఫ్‌ యూత్‌ అంబాసిడర్‌, అసోం స్పోర్ట్స్ .. ఇవ‌న్నీ హిమ‌దాస్ ఖాతాలో ఉన్నాయి. ఇక ప్ర‌ఖ్యాత బీఎస్ఎన్ ఎల్ ప్ర‌మోట‌ర్ గా మేరీకోమ్ భారీ డీల్ కుదుర్చుకున్న సంగ‌తి తెలిసిందే. స్టార్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్ ప్ర‌ఖ్యాత‌ లీనింగ్‌తో నాలుగు సంవత్సరాలకు రూ. 35 కోట్లతో డీల్‌ కుదుర్చుకున్న సంగ‌తి తెలిసిందే.