Begin typing your search above and press return to search.
తెలంగాణ చరిత్రలో అత్యధిక విద్యుత్ డిమాండ్.. రికార్డ్
By: Tupaki Desk | 30 March 2023 10:53 PM GMTతెలంగాణ చరిత్రలో మరో అత్యధిక విద్యుత్ డిమాండ్ నెలకొంది. రాష్ట్రంలో రోజురోజుకు విద్యుత్ వినియోగం భారీగా పెరిగిపోతోంది. రాష్ట్ర చరిత్రలోనే గురువారం అత్యధికంగా విద్యుత్ వినియోగించినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఈరోజు ఉదయం 11.01 నిమిషాలకు అత్యధికంగా 15497 మెగావాట్ల విద్యుత్ నమోదైందని వెల్లడించారు.
మార్చి నెల ప్రారంభం నుంచే 15000 మెగావాట్ల విద్యుత్ వినియోగం నమోదవుతూ వస్తోందని అదికారులు తెలిపారు. వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు అధికం కావడం.. వ్యవసాయ రంగానికి విద్యుత్ వినియోగం పెరగడంతో రాష్ట్రంలో రోజురోజుకి విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది.
సాగువిస్తీర్ణం కూడా పెరగడం, మరోవైపు రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాలకు వినియోగం అధికమవుతుండడంతో అత్యధిక డిమాండ్ నమోదవుతున్నట్టు తెలుస్తోంది. మొత్తం విద్యుత్ వినియోగంలో వ్యవసాయ రంగం వాటానే 37 శాతం ఉండటం గమనార్హం.
బుధవారం 14422 మెగావాట్లు కాగా.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అత్యధికంగా రికార్డు స్తాయిలో గురువారం 15497 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదు కావడం ఇదే తొలిసారి. విద్యుత్ వినియోగంలో దక్షిణ భారతదేశంలో తమిళనాడు మొదటి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో తెలంగాణ ఉంది.
వేసవి ఎండలు మొదలు కావడంతో ఈసారి విద్యుత్ వినియోగం బాగా పెరిగిందని.. ఈ ఏడాది వేసవి కాలంలో 16వేల మెగావాట్లకు డిమాండ్ వచ్చే అవకాశం ఉందన్నారు. మార్చినెలలోనే 15వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదవుతుందని ఊహించామన్నారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు విద్యుత్ సరఫరాకు ముందుగానే అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. రాష్ట్ర రైతాంగానికి ప్రజలు అన్ని రంగాల వినియోగదారులు ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని ప్రభాకర్ రావు స్పష్టం చేశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.