Begin typing your search above and press return to search.
పంద్రాగస్టు.. పది అప్ డేట్స్
By: Tupaki Desk | 15 Aug 2015 5:58 AM GMTఆగస్టు 15 సందర్భంగా దేశ వ్యాప్తంగా చోటు చేసుకున్న పలు పరిణామాలు.. కార్యక్రమాల విషయాల్లోకి వెళితే..
1. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ ఎర్రకోట మీద ఉదయం 7.30 గంటలకు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయగా.. ఏపీ ముఖ్యమంత్రి విశాఖలో ఉదయం 8.55 గంటలకు జెండాను ఆవిష్కరించగా.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గోల్కొండ కోటలో జెండా ఎగురవేయనున్నారు(రాసే సమయానికి ఆయన ఇంకా జాతీయపతాకాన్ని ఎగురవేయలేదు) ఎగురవేస్తారు
2. ఎర్రకోట వద్ద జరిగిన స్వాతంత్ర్య వేడుకలకు ముందు ప్రధాని మోడీ... రాజ్ ఘాట్ వద్ద మహాత్మ గాంధీకి నివాళులు అర్పించారు. ఎర్రకోట వద్ద జరిగిన పంద్రాగస్టు వేడుకులకు అధికార.. విపక్షాలకు చెందిన అతిరథమహారథులు హాజరయ్యారు.
3. ఆగస్టు 15 సందర్భంగా ఎర్రకోట వద్ద ప్రధానమంత్రి జెండా వందనం చేయటం.. అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగించటం మామూలే. అయితే.. రోటీన్ కు భిన్నంగా ప్రసంగించే మోడీ.. ఈసారి స్వాతంత్ర్య దినోత్సవ సందేశం సందర్భంగా ఆసక్తికరమైన అంశాన్ని ప్రస్తావించారు. ప్యూన్.. క్లర్క్.. మెకానిక్ లాంటి ఉద్యోగాలకు సంబంధించి దేశంలో సాగుతున్న ఇంటర్వ్యూ విధానానికినిరసన తెలిపారు. చిన్న చిన్న ఉద్యోగాలకు కూడా సుదీర్ఘ ఇంటర్వ్యూ లు అవసరమా అని ప్రశ్నించారు. రాత పరీక్షతో వారి ప్రతిభను అంచనా వేయలేమా అన్న సందేహాన్ని వెలుబుచ్చారు. తన తాజా సందేశం ద్వారా.. రానున్న రోజుల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి కీలక సంస్కరణలు తీసుకురానున్న విషయాన్ని ఆయన తన మాటలతో చెప్పినట్లుగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
4. తన స్వాతంత్ర్య సందేశంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. తన మానసపుత్రిక అయిన స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ.. చిన్నారులే స్వచ్ఛభారత్ కు బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని.. ఇళ్లను స్వచ్ఛంగా ఉంచే బాధ్యతను పిల్లలు స్వీకరించాలని పిలుపునిచ్చారు.
5. భారత 69వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా వ్యవహరిస్తున్న గవర్నర్ నరసింహన్ తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
6. హైదరాబాద్ లోని ఏపీ అసెంబ్లీ ఎదుట ఏపీ అసెంబ్లీ స్పీకర్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి పలువురు ఏపీ నేతలు హాజరయ్యారు.
7. పంద్రాగస్టు సందర్భంగా వివిధ పార్టీల అధినేతలు.. పార్టీ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు.
8. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని టీమిండియా వన్డే.. ట్వంటీ 20 కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ.. మిలటరీ యూనిఫాంలో సైనికులకు శాల్యూట్ చేస్తున్న ఫోటోల్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. శాల్యూట్ సెల్పీ పేరిట.. పలువురు సెల్రబిటీలు తమ దేశభక్తిని ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే.
9. ఆగస్టు 15 సందర్భంగా ప్రకటించిన అవార్డులకు సంబంధించి.. తనకు లభించిన ఖేల్ రత్న పురస్కారంపై ప్రముఖ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా స్పందించారు. ఖేల్ రత్న పురస్కారం దక్కటం గొప్ప గౌరవం. నా దేశం నా మీద ఇంత ప్రేమ.. గౌరవం చూపినందుకు చాలా సంతోషంగా ఉంది.
10. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం రంగంపల్లిలోని ఎంవీఐ కార్యాలయంలో జాతీయ జెండాకు అవమానం జరిగింది. జాతీయ జెండాను ఆవిష్కరించిన సందర్భంగా అది తిరగబడింది. దీంతో.. దాన్ని వెంటనే యథాతథ స్థితికి అధికారులు తీసుకొచ్చారు.