Begin typing your search above and press return to search.
కేసీఆర్ వైఫల్యాల నుంచి ప్రజా కూటమి ప్రణాళికలు
By: Tupaki Desk | 26 Nov 2018 4:36 PM GMTతెలంగాణ ఎన్నికల్లో టీఆరెస్ ను ఓడించే లక్ష్యంతో ఏర్పడిన ప్రజాకూటమి తన మేనిఫెస్టో విడుదల చేసింది. కాంగ్రెస్ - టీడీపీ - టీజెఎస్ - సిపిఐ పార్టీల నేతలు ఉమ్మడిగా ఈ మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ఇది కేవలం ప్రజాప్రతిపాదికన విడుదల చేశామని.. అవసరాలకు తగ్గట్లు కొత్తగా అంశాలు చేరుతాయన్నారు. ప్రజా ఫ్రంట్ కూటమికి నామకరణం చేసి విడుదల చేసిన ఈ మ్యానిఫెస్టోలో అవినీతి నిర్మూలనను ప్రధాన అంశంగా చేర్చారు. కాగా ప్రజా ఫ్రంట్ కు టీజెఎస్ అధ్యక్షుడు కోదండరాంను కన్వీనరుగా నియమించారు. ప్రజాకూటమి తరపున కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ ను కోదండరాం ప్రకటించారు.
రైతులకు 2 లక్షల రుణమాఫీ - తొలి సంవత్సరంలో లక్షల ఉద్యోగాల భర్తీ - వికలాంగులకు 3 వేల పెన్షన్ తో పాటు ప్రస్తుతం ఉన్న కల్యాణ లక్ష్మి లాంటి పథకాలను కొనసాగిస్తూ కొత్తగా మరికొన్ని అంశాలను జతచేయనున్నామని ప్రకటించారు.
రైతులకు ఒకేసారి రూ.2లక్షల వరకు రుణమాఫీ - పింఛను వయో పరిమితిని 60 నుంచి 58 ఏళ్లకు తగ్గిస్తామని మేనిఫెస్టోలో కూటమి నేతలు వెల్లడించారు. ప్రజా కూటమిని తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తారని - ఈ కమిటీకి కోదండరాం ఛైర్మన్ గా ఉంటారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ తెలిపారు.
జవాబుదారీతనంతో ప్రజాకూటమి హామీలను అమలు చేయడంతో పాటు ప్రజలు కోరుకునే పారదర్శక పాలన అందిస్తామని నేతలు అన్నారు. 100 యూనిట్ల లోపు వినియోగదారులకు విద్యుత్ ఉచితమని కోదండరాం తెలిపారు. 51 నెలల కేసీఆర్ పాలనలో ఎవరినైతే విస్మరించారో ఆయా వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని - ఆ క్రమంలో విద్య - వైద్యం - మౌలిక వసతులు - ఉద్యోగాల కల్పన - పారదర్శక ప్రభుత్వం ఏర్పాటే లక్ష్యమన్నారు. సంక్షేమం - అభివృద్ధి ప్రాధాన్యతనిస్తూ - వ్యవసాయానికి పెద్దపీట వేశామన్నారు.
మేనిఫెస్టో హైలైట్స్ ఇవీ..
* అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా లక్ష ఉద్యోగాలు భర్తీ
* కాంట్రాక్టు - ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి - సమానవేతనం సూత్రం ప్రాతిపదికన వేతన సవరణ.
* గల్ఫ్ కార్మికులకు ప్రయివేటు రిక్రూట్ మెంట్ ఏజెన్సీలు రద్దుచేసి ప్రభుత్వం ద్వారా రిక్రూట్ మెంట్
* వ్యవసాయానికి సంబంధించి ప్రాజెక్టులను పూర్తిచేయడమే కాకుండా మద్దతుధర అమలు - ధరల స్థిరీకరణకు స్థిరీకరణ నిధి - సన్న - చిన్నకారు రైతులకు బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది.
* ముంపు బాధితులకు తక్షణ సాయం* అటవీ హక్కుల చట్టం అమలు
* ప్రాథమిక - ఉన్నత పాఠశాలల్లో ఆంగ్ల బోధనా సౌకర్యం - ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఒక పాలిటెక్నిక్ - ఒక జూనియర్ - డిగ్రీ కళాశాల
* ప్రతి మండల కేంద్రంలో ఐటీఐ జూనియర్ కాలేజీ - ప్రతిజిల్లాలో ఒక ఇంజినీరింగ్ - పీజీ సెంటర్
* పాఠశాల విద్య నిర్వహణ కోసం స్వయంప్రతిపత్తి కల్గిన కమిషనరేట్ ఏర్పాటు
* ఫీజు రీయంబర్స్ మెంట్ శాస్త్రీయంగా నిర్ణయించి సకాలంలో చెల్లిస్తాం
* నిజాం షుగర్స్ - సిర్పూర్ పేపర్ మిల్లు సారంగ పూర్ షుగర్స్ ను తెరిపించి వాటిని నడిపించడం