Begin typing your search above and press return to search.
మీసం మెలేసిన మిరాజ్ సత్తా ఇదే..
By: Tupaki Desk | 27 Feb 2019 8:13 AM GMTభారత సైనికులపై పుల్వామాలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేసిన దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్లోని ఉగ్ర శిబిరాలపై భారత వైమానిక దళం మంగళవారం మెరుపు దాడి చేసింది. ఈ దాడిలో దాదాపు 300 నుంచి 400మంది ఉగ్రవాదులు మరణించినట్లు ప్రాథమిక అంచనా. సర్జికల్ స్ట్రైక్-2గా పిలుస్తున్న ఈ దాడిలో మిరాజ్-2000 యుద్ధ విమానాలు కీలక పాత్రపోషించాయి. పాక్ ఉగ్ర శిబిరాలను నేలకూల్చి భారత్ మీసం మేలేసేలా చేశాయి. ఇప్పుడు మిరాజ్ యుద్ధ విమానాలు చూసి భారత్ సగర్వంగా తలెత్తుకు నిలబడింది.
పాక్ ఉగ్రశిబిరాలను ధ్వంసం చేసిన మిరాజ్-2000 ప్రత్యేకత ఏంటనే విషయం అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.. ఈ యుద్ధ విమానాలను ఈ దాడిలోనే కాదు ఇంతకముందు కార్గిల్ యుద్ధంలో కూడా వాయుసేన ఉపయోగించింది. ఆ కార్గిల్ యుద్ధంలో మిరాజ్ ధాటికి పాక్ సైన్యం తోకముడిచింది. భారత్ విజయం సాధించింది. నాటి నుంచి మిరాజ్ యుద్ధవిమానాలు భారత అమ్ముల పొదిలో ప్రధాన అస్త్రాలుగా మారాయి. భారత్ శక్తికి నమ్మినబంటుగా ఉన్నాయి.
మిరాజ్ యుద్ధ విమానాలను మొదటిసారిగా ఫ్రాన్స్ దేశానికి చెందిన డసాల్ట్ ఏవియేషన్ తయారు చేసింది. ఆ కంపెనీతో ఒప్పందంలో భాగంగా లైసెన్స్ తో హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ భారత్ లో తయారుచేసింది. 1970లో తొలిసారి మిరాజ్ సేవలు భారత వాయిసేనలోకి అందుబాటులోకి వచ్చాయి. దీనిలో సింగిల్ సీటర్ - టూసీటర్ మల్టీరోల్ ఫైటర్లున్నాయి. దీని ద్వారా తొమ్మిది చోట్లకు ఆయుధాలను తీసుకెళ్లవచ్చు. ఎంబీడీఏ ఏఎస్ 30ఎల్, ఎంబీడే ఆర్మాట్ యాంటీ రాడార్ మిస్సైల్ - ఎంబీడీఏ బీజీఎల్ 1000 లేజర్ గైడెడ్ బాంబు - ఏంబీడీఏ ఏఎం 39 ఎక్సోసెట్ యాంటీ షిప్ మిస్సైల్ - ఎంబీడీఏ రాకెట్ లాంఛర్లు - ఎంబీడీఏ ఆపాచీ స్టాండ్ ఆఫ్ ఆయుధాలను ఈ యుద్ధ విమానాల ద్వారా మెసుకెళ్లవచ్చు.
గంటకు 2,795 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తూ నిమిషాల వ్యవధిలో టార్గెట్ పై బాంబుల వర్షం కురిపిస్తుంది. చిమ్మచీకట్లో కూడా గురి చేసి దెబ్బకొట్టడం ఈ యుద్ధ విమానాల ప్రత్యేకతగా చెప్పొచ్చు. అంతేకాదు ఆకాశం నుంచి ఆకాశంలోకి ఆయుధాలను ప్రయోగించగలదు. ఒక్క నిమిషంలో 1200 నుంచి 1800 రౌండ్ల ఫిరంగుల్ని పేల్చగలదు. కేవలం 21 నిమిషాల్లో మంగళవారం పాక్ ఉగ్ర స్థావరాలపై దాడిచేసి శత్రువు తేరుకునేలోపు టార్గెట్ పూర్తిచేసి వచ్చాయంటే దీని సత్తా ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.