Begin typing your search above and press return to search.
ఏపీ బడ్జెట్ స్వరూపం ఇదే.. హైలెట్స్ లోకి వెళితే
By: Tupaki Desk | 16 March 2023 1:00 PM GMTచారిత్రక మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జగన్ ప్రభుత్వం ఏపీ బడ్జెట్ ను తన హయాంలో చివరిసారి ప్రవేశ పెట్టింది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఈఏడాది పెట్టిన బడ్జెట్ పూర్తిస్థాయిగా చెప్పక తప్పదు.వచ్చే ఏడాది ఎన్నికలకు ముందు పెట్టే బడ్జెట్ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టే వీల్లేదు.
దీంతో.. జగన్ ప్రభుత్వానికి ఇదే పూర్తిస్థాయి ఆఖరు బడ్జెట్ గా చెప్పాలి. ఇక.. బడ్జెట్ విషయానికి వస్తే.. రూ.2.79 లక్షల కోట్లతో భారీగా ప్రవేశ పెట్టారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ తో పోలిస్తే కాసింత తక్కువగా ఉన్న ఈ బడ్జెట్ లోని విశేషాల విషయానికి వస్తే..
ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ మొత్తం రూ.2,79,279 కోట్లు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి (2023 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు) పెట్టిన బడ్జెట్ లో రెవెన్యూ వ్యయం రూ.2,28,540 కోట్లు కాగా.. మూలధన వ్యయం రూ.31,061 కోట్లు. రెవెన్యూ లోటు రూ.22,316 కోట్లు కాగా ద్రవ్య లోటు రూ.54,587 కోట్లుగా చెప్పాలి. ఏపీ ద్రవ్య లోటు 1.54 శాతంగా పేర్కొన్నారు. జీఎస్డీపీలో రెవెన్యూ లోటు 3.77 శాతమని వెల్లడించారు.
బడ్జెట్ ను సభలో ప్రవేశ పెట్టే వేళలో.. విపక్ష టీడీపీ నేతలు తీవ్రంగా అభ్యంతరం పెడుతున్న వేళ.. వారు మౌనంగా ఉండాలని స్పీకర్ పదే పదే చెప్పినా.. వారు వినని పరిస్థితి. దీంతో.. టీడీపీ సభ్యుల్ని ఒక రోజు సభ నుంచి సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఇక.. బడ్జెట్ సందర్భంగా శాఖల వారీగా కేటాయింపుల్ని చూస్తే..
- ఆర్థిక శాఖకు రూ.72,424 కోట్లు
- బీసీ సంక్షేమ శాఖకు రూ.23,509 కోట్లు
- వైద్య, ఆరోగ్య శాఖకు రూ.15,882 కోట్లు
- నీటిపారుదల రంగానికి రూ.11,908 కోట్లు
- వ్యవసాయ రంగానికి రూ.11,589 కోట్లు
- పట్టణాభివృద్ధికి రూ.9381 కోట్లు
- హోంశాఖకు రూ.8206 కోట్లు
- గృహనిర్మాణ శాఖకు రూ.6292 కోట్లు
- గ్రామ, వార్డు సచివాలయాలకు రూ.3858 కోట్లు
- పరిశ్రమలు, వాణిజ్యం రూ.2602 కోట్లు
- మైనార్టీ సంక్షేమానికి రూ.2240 కోట్లు
- పశుసంవర్ధక శాఖకు రూ.1787 కోట్లు
- జీఏడీకి రూ.1418 కోట్లు
- మౌలిక వసతులు, పెట్టుబడులకు రూ.1295 కోట్లు
- న్యాయశాఖకు రూ.1058 కోట్లు
- కార్మిక శాఖకు రూ.796 కోట్లు
- పర్యావరణానికి రూ.685 కోట్లు
- ఐటీ శాఖకు రూ.215 కోట్లు
- అసెంబ్లీ, సెక్రటేరియట్ రూ.111 కోట్లు
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.